MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీముఖి షోలో శోభాశెట్టికి రింగ్‌ తొడిగిన బాయ్‌ ఫ్రెండ్‌.. ప్రేమించడానికి క్రేజీ కారణం చెప్పిన ఫైర్‌ బ్రాండ్‌

శ్రీముఖి షోలో శోభాశెట్టికి రింగ్‌ తొడిగిన బాయ్‌ ఫ్రెండ్‌.. ప్రేమించడానికి క్రేజీ కారణం చెప్పిన ఫైర్‌ బ్రాండ్‌

బిగ్‌ బాస్‌ 7 షోలో పాపులర్‌ అయిన శోభా శెట్టి ప్రియుడు శ్రీముఖి షోలో సందడి చేశారు. అందరి ముందు శోభా శెట్టికి లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. ఏకంగా రింగ్‌ తొడిగి సర్‌ప్రైజ్‌ చేశాడు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 30 2023, 09:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 బిగ్‌ బాస్‌7 షోలో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకుంది శోభా శెట్టి. దాదాపు 14 వారాలపాటు ఆమె హౌజ్‌లో ఉంది. ఈ క్రమంలో ఆమెపై అనేక ట్రోల్స్ వచ్చాయి. ఎలిమినేట్‌ చేయాలనే డిమాండ్‌ వచ్చింది. హౌజ్‌లోనూ మోనితలాగే ఉందనే విమర్శలు వచ్చాయి. తను ఫేక్‌ అంటూ నెట్టింట రచ్చ చేశారు. కానీ ఆల్మోస్ట్ చివరి వరకు ఉండి, తనేంటో చాటి చెప్పింది శోభా శెట్టి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

తాను ప్రేమలో ఉన్నట్టు, తనకు లవర్‌ ఉన్నట్టు కూడా షోలో వెల్లడించింది. అంతేకాదు ఆయన శోభా శెట్టి కోసం హౌజ్‌కి కూడా వచ్చాడు. ఆమెని సర్‌ ప్రైజ్‌ చేశాడు. ఆయన ఎవరో కాదు `కార్తీకదీపం` సీరియల్‌లో డాక్టర్‌ బాబుకి తమ్ముడి పాత్ర చేసి యశ్వంత్‌. చాలా కాలంగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని శోభా శెట్టి వెల్లడించింది. 
 

37

ఇదిలా ఉంటే శ్రీముఖి షోలో శోభా శెట్టిని సర్‌ ప్రైజ్‌ చేశారు. శ్రీముఖి యాంకర్‌గా ఆదివారం స్టార్‌ మా పరివార్‌ షో నడుస్తుంది. ఆదివారం మధ్యాహ్నం ఇది ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు, సీరియల్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఇయర్‌ ఎండ్‌ సెలబ్రేషన్‌ మాదిరిగా ఈ షో సాగింది. అర్జున్‌, అమర్ దీప్‌, ప్రియాంక వంటి వారు పాల్గొన సందడి చేశారు. 
 

47

అందులో భాగంగా శోభా శెట్టి కూడా వచ్చింది. ఆమెకి షోలో సర్‌ ప్రైజ్‌ చేసింది శ్రీముఖి. కళ్లకి గంతలు కట్టి ప్రియుడు యశ్వంత్‌ని తీసుకొచ్చి ముందు నిల్చోబెట్టారు. ఆయన్ని చూసి ఆశ్చర్యపోయింది శోభా. ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఆనందంతో ఉప్పొంగిపోయింది. అంతేకాదు షోలోనే ఆమెకి ప్రపోజ్‌ చేశాడు యశ్వంత్‌. 
 

57

రోజా పువ్వు తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ఆమెకి ప్రపోజ్‌ చేయగా మరింతగా హ్యాపీ అయ్యింది శోభా శెట్టి. శ్రీముఖి ఉండి.. శోభా ఎలా అనిపించింది ఈ సర్‌ప్రైజ్‌ అనగా.. వాడు షోకే రాడు సరిగా, ఇక్కడికి వస్తాడని అస్సలు ఊహించలేదని తెలిపింది. ఈ క్రమంలో మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు యశ్వంత్‌. 
 

67

స్టేజ్‌పైనే, అందరి ముందు శోభా శెట్టికి రింగు తొడిగాడు. కొత్త ఏడాది గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ తొడిగినంత పని చేశాడు. ఇలా వరుస సర్‌ప్రైజ్‌లకు శోభా శెట్టి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. దీంతో అటు ఆర్టిస్టులు, కమెడియన్లు ఇలా అంతా ఆశ్చర్యపోయారు. అనంతరం ఓ క్రేజీ ప్రశ్న అడిగింది యాంకర్‌ శ్రీముఖి. 
 

77

యశ్వంత్‌ని ప్రేమించడానికి కారణమేంటి? అని అడిగింది శ్రీముఖి. దీనికి శోభా శెట్టి స్పందిస్తూ తనని ఎక్కువగా కేరింగ్‌ చేస్తాడని, అంతేకాదు వాడి ఇన్‌స్టా ప్రొఫైల్‌ కూడా చెక్‌ చేశాను, ఎక్కువగా అమ్మాయిలను ఫాలో చేయడం లేడు అంటూ బాంబ్‌ పేల్చింది. క్రేజీగా ఆన్సర్‌ ఇచ్చింది. దీనికి అంతా ఆశ్చర్యపోయారు. అటు శ్రీముఖి నోరెళ్లబెడితే, యశ్వంత్‌ కూడా అవాక్కయ్యాడు. ఇంత చేస్తుందా అనేలా ఫీల్‌ అయ్యాడు. ఇది చూసిన మానస్‌.. అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడు. `బ్రో నీ ఫ్యూచర్‌ కనిపిస్తుంది` అని పంచ్‌ వేయడంతో షోలో నవ్వులు విరిసాయి. యశ్వంత్‌ కూడా నవ్వులు చిందించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh రెమ్యునరేషన్ 2.5 కోట్లు, సైడ్ క్యారెక్టర్ కోసం శోభన్ బాబు 2 కోట్లు అడిగారా? మిస్సైన బ్లాక్ బస్టర్
Recommended image2
Peddi Trailer: రామ్ చరణ్ కోసం రంగంలోకి స్టార్ క్రికెటర్, భారీ స్థాయిలో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్, ఎక్కడంటే?
Recommended image3
Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved