MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ లో నటించాలంటే చాలా కష్టం, సెట్స్ లో దాని వల్లే చిరాకు.. గోల్డెన్ లెగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో నటించాలంటే చాలా కష్టం, సెట్స్ లో దాని వల్లే చిరాకు.. గోల్డెన్ లెగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో నటించడం చాలా కష్టం అని తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. టాలీవుడ్ తో పోల్చుకుంటే మలయాళీ చిత్రాల్లో నటించడం చాలా సులభం అని పేర్కొంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 10 2024, 06:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడంతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్  క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగులో సంయుక్త్ మీనన్ భీమ్లా నాయక్, విరూపాక్ష లాంటి హిట్స్ అందుకుంది. 

 

26

రెండు చిత్రాల్లో సంయుక్త వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. భీమ్లా నాయక్ చిత్రంలో సంయుక్త రానాకి భార్యగా నటించింది. ఎమోషనల్ గా నటించి మెప్పించింది. బింబిసార చిత్రంలో కూడా సంయుక్త నటించింది. ఆమె నటించిన ప్రతి చిత్రం సూపర్ హిట్ గా మారడంతో సంయుక్త మీనన్ ని టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అని పిలవడం ప్రారంభించారు. 

 

36

అయితే సంయుక్తకి కూడా చివరగా ఎదురుదెబ్బ తగిలింది. కళ్యాణ్ రామ్ సరసన నటించిన డెవిల్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం సంయుక్త నిఖిల్ కి జోడిగా స్వయంభు అనే చిత్రం చేస్తోంది. టాలీవుడ్ లో వరుస సక్సెస్ లు, వరుస ఆఫర్స్ అందుకుంటున్న సంయుక్త సంచలన వ్యాఖ్యలు చేసింది. 

46

టాలీవుడ్ లో నటించడం చాలా కష్టం అని తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. టాలీవుడ్ తో పోల్చుకుంటే మలయాళీ చిత్రాల్లో నటించడం చాలా సులభం అని పేర్కొంది. అందుకు గల కారణాన్ని కూడా వివరించింది. 

56

మలయాళీ చిత్రాల్లో నేచురల్ గా సింపుల్ ఎక్స్ ప్రెషన్స్ తో నటించవచ్చు. నటనలో మనకి ఫ్రీడమ్ ఉంటుంది. ఎలా అనుకుంటే అలా నటించే వీలుంటుంది. మేకప్ కూడా చాలా తక్కువ. వీలైనంత వరకు నేచురల్ గా చూపిస్తారు. కానీ టాలీవుడ్ లో మేకప్ చాలా ఓవర్ గా వేసారు. సెట్స్ లో ఉన్నంత సేపు ముఖానికి ఏదో అంటుకుని ఉన్న ఫీలింగ్ ఉంటుంది. 

 

66

మేకప్ వేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అది పోకుండా జాగ్రత్త పడుతూ నటించాలి అంటూ టాలీవుడ్ లో తన కష్టాలు చెప్పుకొచ్చింది సంయుక్త మీనన్. ఒకవైపు టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ అంటూ ప్రశంసలు అందుకుంటున్న సంయుక్త.. ఇలా మాట్లాడడం ఒకింత సంచలనమే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju Favorite Hero: కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన సినిమా వస్తుందంటే టీవీకి అతుక్కుపోతాడు
Recommended image2
NTR డైరెక్షన్ లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? నిజమెంత?
Recommended image3
Nagarjuna కెరీర్ లో ఇష్టపడి చేయలేకపోయిన పాత్ర ఏదో తెలుసా? కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved