RRR Movie: ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్... ఎన్టీఆర్, చరణ్ టార్గెట్ రీచ్ అయ్యారా?
ఆర్ ఆర్ ఆర్ బాక్సాఫీస్ ఊచకోత కొనసాగుతుంది. విడుదలైన 8వ రోజు కూడా సాలిడ్ వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. అయితే భారీ ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఆర్ ఆర్ ఆర్ ఇంకా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కి చేరుకోలేదు.

RRR Movie
రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్(RRR Movie Collections) కలెక్షన్స్ దుమ్మురేపుతోంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ ఆదరణ దక్కించుకుంటుంది. ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్ ల నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అదే సమయంలో తమ హీరోల పేరిట భారీ రికార్డ్స్ నమోదవుతుండగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక హిందీ బెల్ట్ లో కూడా ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటుతుంది. ఈ మూవీ రూ. 150 కోట్ల వసూళ్ల వైపు దూసుకెళుతోంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ పెద్ద మొత్తంలో వసూళ్లు సాధించినప్పటికీ కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు.
RRR Movie
సినిమాకున్న డిమాండ్ రీత్యా రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. అతిపెద్ద టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్ ఆర్ ఆర్ దాన్ని దాటేందుకు బాక్సాఫీస్ వద్ద యుద్ధం చేస్తుంది. శనివారం పండగ దినం కావడం ఆర్ ఆర్ ఆర్ కి కలిసొచ్చే అంశం. ఈ వారం కూడా ఆర్ ఆర్ ఆర్ దే అని చెప్పాలి. దానికి కారణం చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలేమీ విడుదల కాలేదు.
RRR Movie
నైజాంలో భారీ లాభాల దిశగా వెళ్తున్న ఆర్ ఆర్ ఆర్ ఆంధ్రాలో మాత్రం వెనకబడింది. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కి ఇంకా చేరుకోలేదు. అయితే చాలా దగ్గరగా రావడంతో బయ్యర్లు సేవ్ కానున్నారు. యూఎస్ లో కూడా ఆర్ ఆర్ ఆర్ టార్గెట్ ఎప్పుడో దాటేసింది. యూఎస్ లో ఆర్ ఆర్ ఆర్ లాభాల వర్షం కురిపిస్తుంది. కాగా హిందీలో ఆర్ ఆర్ ఆర్ అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అక్కడ మూవీ బ్రేక్ ఈవెన్ కి చేరుకోలేదు. అలాగే తమిళనాడు, కర్ణాటకలో ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంది.
RRR Movie
ఆర్ ఆర్ ఆర్ లెక్కలు పరిశీలిస్తే... ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 8 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 414.88 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 38.12 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది. క్రేజీ కాంబోలో భారీగా రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
RRR Movie
దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 8 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 414.88 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 38.12 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది. రాజమౌళి (Rajamouli) పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా... అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు.