MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆమె ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి, వైరల్ చేస్తున్న స్టార్ హీరో ఫ్యాన్స్.. పోలీస్ కంప్లైంట్

ఆమె ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి, వైరల్ చేస్తున్న స్టార్ హీరో ఫ్యాన్స్.. పోలీస్ కంప్లైంట్

 ఇలాంటి పరిస్థితి ఎదురయితే కలిగే మానసిక వేదన అంతాఇంతా కాదు. అవమానం తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. 

3 Min read
Surya Prakash
Published : May 02 2024, 07:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

 
 డిజిటల్ యుగంలో సైబర్ క్రైమ్సే దే రాజ్యం అయ్యింది. ప్రతీ రోజు కొన్ని వందల మంది సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు.  ఏటేటా నమోదవుతోన్న సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. నిజంగా నేరాలు పెరగడం ఒకవైపు, జనాల్లో అవగాహన పెరిగి ఫిర్యాదులు చేయడం కూడా దీనికి కారణం అని చెబుతున్నారు. సైబర్ క్రైమ్ లలో ఎక్కువగా బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు కనపడుతున్నాయి. అయితే అందరూ డబ్బు కోసమే చేస్తారని కాదు. కొందరు తమ అభిమాన హీరో గురించి కూడా ఇలాంటి వాటికి తెగబడతున్నారు.

210


ముఖ్యంగా జీవిత భాగస్వామితోనో, ప్రేమించినవారితోనో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో లీకయితే.. సోషల్ మీడియాలో పెట్టుకున్న ఫొటోలను దొంగిలించి, మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తే.. వైరల్ చేస్తామని బెదిరిస్తే.. ఇలాంటి పరిస్థితి ఎదురయితే కలిగే మానసిక వేదన అంతాఇంతా కాదు. అవమానం తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.  తాజాగా స్టార్ హీరో రణబీర్ కపూర్ అభిమానులు అని చెప్పుకునే వాళ్లు ఇలాంటి పనికి పాల్బడ్డారు.

310


రీసెంట్ గా  ‘యానిమల్‌’తో సూపర్‌ హిట్‌  కొట్టిన  రణ్‌బీర్‌ (Ranbir Kapoor) తర్వాత సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపొందించనున్న ‘రామాయణ’లో ఆయన రాముడు గా కనిపించనున్నారు. ఈ లుక్‌ కోసం జిమ్‌లో శ్రమిస్తున్నారు.దర్శకుడు నితీష్ తివారీ రామాయణం యొక్క అనుసరణపై చాలా దృష్టిని ఆకర్షిస్తోంది, ఈ చిత్రం గురించిన వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

410


  రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ నుండి లీక్ అయిన ఫోటోలు రాముడిగా రణబీర్ కపూర్ మరియు సీతా దేవతగా సాయి పల్లవి ఫస్ట్ లుక్‌ను అందిస్తున్నాయి. జూమ్ టీవీ ద్వారా బయిటకు వచ్చిన ఫొటోలు  ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫొటో చూసి ఒకావిడ రణబీర్ కపూర్ లుక్ బాగోలేదంటూ కామెంట్ చేసింది.అదే ఇప్పుడు అగ్గి రాజేసినట్లు అయ్యింది.
 

510
ranbir kapoor and sai pallavi character look of Ramayana movie is leaked

ranbir kapoor and sai pallavi character look of Ramayana movie is leaked

మా హీరో లుక్ నే అనేటంత గొప్పదానివా అంటూ ఆమెపై వేధింపులకు దిగారు. సోషల్ మీడియాలో రణబీర్ కపూర్ అభిమానులు గా చెప్పుకునే కొందరు ఆమెను హెరాస్ చేయటం మొదలెట్టారు. ఈ క్రమంలో ఆమె తన పర్శనల్ ఫొటోలు లీక్ చేసి, వాటిని మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్నట్లు వాపోయింది.

610
ranbir kapoor and sai pallavi character look of Ramayana movie is leaked

ranbir kapoor and sai pallavi character look of Ramayana movie is leaked


తన ఫొటోలు, వీడియోలుని మార్ఫింగ్ చేసి తనను కంటిన్యూగా హెరాస్ చేస్తున్నారని, ఎడిటింగ్ చేసిన ఫొటోలు, బూతు వీడియోలతో తనను చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారవని రాసుకొచ్చింది. తను ఎంత చెప్పినా వినటం లేదని, DM లోని ఒరిజనల్ వీడియోలు,ఫొటోలను తీసుకుని చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. 
 

710


ఈ బాథ పడలేక తాను మధ్యప్రదేస్ స్టేట్ సైబర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు ఈ ఆన్ లైన్ బుల్లీయింగ్ మీద కంప్లైంట్ చేసానని చెప్పారు. ఆ డాక్యుమెంట్స్ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసారు. నేను సాక్ష్యాలను ఎటాచ్ చేస్తున్నాను. ఎడిట్ ఇమేజెస్, స్క్రీన్ షాట్స్ మొత్తం ఈ కంప్లైంట్ లో సాక్ష్యంగా పెడుతున్నాను. మీకు ఏమి కావాలన్నా నేను వెంటనే అందచేస్తాను. దయచేసి వీళ్లపై సరైన యాక్షన్ తీసుకుని న్యాయం చేయండని ఆన్ లైన్ లోనే ఆమె పోలీస్ లకు కంప్లైట్ చేసింది. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది. 
 

810


లీకైన చిత్రాలు రణబీర్ కపూర్ రాముడి పాత్రను ధరించి రాచరిక వస్త్రధారణతో అలంకరించబడి ఉండగా, సాయి పల్లవి సీత పాత్రకు తగినట్లు మొహంలో  దయని ప్రసరిస్తోంది. రణబీర్, సాయి కలిసి ఓ ప్రాజెక్ట్ చేయడం ఇదే తొలిసారి.  పాత్ర కోసం, రణబీర్ కఠినమైన శాఖాహార ఆహారం మరియు కఠినమైన వ్యాయామ నియమాలకు కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు. అందుకు కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను అతని ఫిట్‌నెస్ ట్రైనర్ కూడా షేర్ చేశారు. 

910

ఈ చిత్రంలో రణ్‌బీర్‌ లుక్‌ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.  ఇక ఇటీవల ఈ బాలీవుడ్‌ హీరో విలువిద్య నేర్చుకుంటున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రం కోసం ఆయన  కొన్ని రోజుల పాటు మాంసాహారం, మద్యపానం మానేశారు.  భారీ తారాగణంతో నిర్మిస్తున్న ‘రామాయణ’ అప్‌డేట్స్‌ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలల పాటు ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుపుకొన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ముంబయిలోని ఓ స్టూడియోలో చిత్రీకరణ మొదలైంది. 

1010


ఇందులోని నటీనటులు లుక్‌లు లీక్‌ కాకుండా ఉండేందుకు సెట్స్‌లోకి సెల్‌ఫోన్‌లను నిషేధించారు. దీనికి తెలుగు వెర్షన్‌ సంభాషణలు రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram)కు అప్పగించినట్లు సమాచారం. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మూడు భాగాలుగా దీన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. తొలి పార్ట్‌ను 2025 దీపావళికి తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారు. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
సాయి పల్లవి
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
Recommended image2
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
Recommended image3
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved