ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 81.86 శాతం పోలింగ్.. దేశంలోనే ఇది అత్య‌ధికం : సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

AP Assembly Polls : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్ల‌డించారు. ఇందులో ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ న‌మోదుకాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతంగా ఉన్నాయ‌ని తెలిపారు.
 

In Andhra Pradesh, 81.86 per cent polling was recorded. This is the highest in the country in recent times: CEO Mukesh Kumar Meena RMA

Andhra Pradesh Elections 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తాజాగా జ‌రిగిన అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన పోలింగ్ వివ‌రాల‌ను సీఈవో ముఖేష్ కుమార్ బుధ‌వారం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో పంచుకున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ న‌మోదైంద‌ని తెలిపారు. పోలింగ్ శాతంతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకున్న ప‌లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, భ‌ద్ర‌తా ప‌రంగా తీసుకున్న చ‌ర్య‌ల‌ను గురించి వివ‌రించారు. హింస చోటుచేసుకున్న చోట వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు.

రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం..  

ప్ర‌స్తుతం జ‌రిగి ఎన్నిక‌ల్లో న‌మోదైన పోలింగ్ శాతం గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే అత్య‌ధిక‌మ‌ని అన్నారు. ఉమ్మ‌డి ఏపీ, విడిపోయిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ ఈ స్థాయి పోలింగ్ శాంతం న‌మోదుకాలేద‌ని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్ నమోదైందనీ, ఇందులో ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ న‌మోదుకాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా పోలింగ్ శాతంలో అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 87.09 శాతం పోలింగ్ న‌మోదైంది. విశాఖప‌ట్నంలో అత్య‌ల్పంగా 68.63 శాతం పోలింగ్ న‌మోదైంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధికంగా దర్శిలో 90.91 శాతం ఓటింగ్ న‌మోదైంది. అత్యల్పంగా తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 63.32 శాతం న‌మోదైంద‌ని ముఖేష్ కుమార్ తెలిపారు.

ఉద‌యం, సాయంత్ర వేళ‌లో పోటెత్తిన ఓట‌ర్లు..

త‌మ ఓటు హ‌క్కును వినియోగించ‌డానికి ఉద‌యం, సాయంత్రం స‌మ‌యంలో ఓట‌ర్లు భారీగా కేంద్రాల‌కు త‌ర‌లివ‌చ్చారు. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో కాస్త నెమ్మ‌దించింది. పెద్ద సంఖ్య‌లో ఓట‌ర్లు ఓటింగ్ కేంద్రాల్లో క్యూలో ఉండ‌టంతో  మొత్తం 3,500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రంలో అర్థరాత్రి 2 గంటల వ‌ర‌కు కూడా పోలింగ్ జ‌రిగింద‌ని తెలిపారు. ఓటింగ్ పూర్త‌యిన త‌ర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్ ల‌కు తీసుకురావ‌డానికి కాస్త స‌మ‌యం ఆల‌స్యం అయిందన్నారు. దీనికి టెక్నిక‌ల్ ప్రాబ్లమ్స్,  పోలింగ్ ఆల‌స్యం కావ‌డం, వాతావ‌ర‌ణ ప్ర‌భావం, ప‌లు అనుకోని సంఘ‌ట‌న‌లు కార‌ణాలుగా ఉన్నాయ‌ని తెలిపారు. 

మొత్తం  4,13,33,702 ఎలక్ట‌ర్స్.. దేశంలోనే అత్యధిక ఓటింగ్ శాతం..

ఏపీ ఎన్నిక‌ల్లో న‌మోదైన ఓటింగ్ శాతం దేశంలోనే అత్య‌ధిక‌మ‌నీ, ఇది కొత్త రికార్డు అని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీ అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల కోసం ఓటు హ‌క్కు ఉప‌యోగించుకున్న మొత్తం ఎలక్ట‌ర్స్  4,13,33,702 గా ఉన్నారు. పార్లమెంట్‌కు 3 కోట్ల 33 లక్షల 4,560 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓటింగ్ లో పోస్టల్ బ్యాలట్ 4,44,216, హోం ఓటింగ్ 53,573 కాగా మొత్తం 4,97,789 (1.2 శాతం) గా నమోదైంది. మొత్తం ఓటర్లలో 1,64,30,359 మంది పురుషులు, 1,69,08,684 మంది మహిళా ఓటర్లు, 1517 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. గతంలో కంటే అధికంగా పోలింగ్ నమోదు అయిందని తెలిపారు. ప్రస్తుత నాలుగు ఫేజ్ లలో దేశంలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో పోలింగ్ నమోదుకాలేదని ముఖేష్ కుమార్ మీనా తెలిపాడు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్స్‌లో ఈవీఎంలను భద్రపరిచినట్టు వెల్లడంచారు.

 

 

ర‌స‌వ‌త్త‌రంగా ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు.. 2 స్థానాల కోసం 5 జ‌ట్ల ఫైట్.. ఛాన్సులు ఇలా ఉన్నాయి.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios