Asianet News TeluguAsianet News Telugu

వంతెన చూసి..., వాళ్లకే ఓటు వేయాలని రష్మిక ప్రజలకు విజ్ఞప్తి

 దేశంలోనే పొడవైన వంతెన ఇది. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌లోని నహవా శేవాను కలుపుతూ ₹21,200కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించిన అటల్‌ సేతు మొత్తం పొడవు 21.8 కి.మీ.లు కాగా.. 

Rashmika expressed her heart out for building Mumbai-trans Harbour Link jsp
Author
First Published May 15, 2024, 8:33 AM IST


 దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ (MTHL)’ రాకపోకలు మొదలైన సంగతి తెలిసిందే. ‘అటల్‌ సేతు’గా పిలుస్తోన్న దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జనవరిలో ప్రారంభించనున్నారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ రూ.21,200 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించారు. మొత్తం పొడవు దాదాపు 22 కి.మీలు కాగా.. 16 కి.మీలకుపైగా అరేబియా సముద్రంపై ఉంటుంది.

ఇలా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ (MTHL)పై సినీనటి రష్మిక (Rashmika mandanna) ఇటీవల ప్రయాణించారు. ఆ వంతెనపై ప్రయాణ అనుభూతిని షేర్‌ చేసుకున్నారు. రెండు గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చని.. ఇలాంటివి సాధ్యమవుతాయని ఎవరూ అనుకోలేదన్నారు. ఇప్పుడు మనం ముంబయి నుంచి నవీ ముంబయికి సులువుగా ప్రయాణించవచ్చని తెలిపారు. 

ఇటీవల ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. యువ భారత్‌ దేన్నయినా సాధించగలదన్న రష్మిక.. గత పదేళ్లలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పారు. దేశంలో మౌలికవసతులు, రహదారి ప్రణాళిక అద్భుతంగా ఉన్నాయన్న ఆమె.. అభివృద్ధికే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇక బ్రిడ్జిపై గరిష్ఠ వేగం 100 కి.మీలు కాగా, కనిష్ఠ వేగం 40 కి.మీలుగా నిర్దేశించారు. సేవ్రీ నుంచి నవా షేవాకు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదు. ఒకసారి ప్రయాణిస్తే రూ.250 టోల్‌ వసూలు చేస్తోంది  మహారాష్ట్ర ప్రభుత్వం.  దేశంలోనే పొడవైన వంతెన ఇది. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌లోని నహవా శేవాను కలుపుతూ ₹21,200కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించిన అటల్‌ సేతు మొత్తం పొడవు 21.8 కి.మీ.లు కాగా.. అందులో 16 కి.మీ.లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం.

రష్మిక కెరీర్ విషయానికి వస్తే...ఆమె  తెలుగు, హిందీల్లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప 2’లో శ్రీవల్లిగా అలరించనున్నారు. ఆగస్టు 15న ఇది విడుదల కానుంది. ధనుష్‌- నాగార్జున కాంబినేషన్‌లో శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’లోనూ తనే హీరోయిన్‌. సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘సికందర్‌’లో సందడి చేయనున్న రష్మిక.. ‘రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘చావా’ సినిమాలతో బిజీగా ఉన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios