Asianet News TeluguAsianet News Telugu

ఆ పదం వాడితే రెండు కోట్లు జరిమానా

అనుమతి లేకుండా పేరు, ఫోటో, వాయిస్, భీడు అనే పదం వాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, 2 కోట్ల రూపాయల జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. 

Jackie Shroff Moves Delhi HC Against Unauthorised Use Of His Voice jsp
Author
First Published May 15, 2024, 10:39 AM IST


బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ హై కోర్టును ఆశ్రయించటం అంతటా చర్చనీయాంశమైంది. అందుకు కారణం తన అనుమతి లేకుండా ప్రజలు తన పేరును తమ పనికి వాడుకుంటున్నారని జాకీ అభ్యంతరం వ్యక్తం చేయటమే. బాలీవుడ్ లో అతడికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతడి స్టైల్‌, మ్యానరిజం, డైలాగ్‌ డెలివరికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆయన అభిమానులు ఆయనను ముద్దుగా 'భీడు' అని పిలుచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ పేరు విషయమై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వానికి, పేరుకు రక్షణ కల్పించాలని కోరుతూ మంగళవారం (మే 14) హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఇక  జాకీ ష్రాఫ్‌కు  స్టైల్‌లో భీడు అని చెబితే జనాలు పిచ్చెక్కిపోతారు. ఇది మాత్రమే కాదు, అతను మాట్లాడే విధానం, అతని నడక, అతని హావభావాలు మరియు వాయిస్ మాడ్యులేషన్ కూడా ఇతర నటీనటుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలో ఆ డైలాగ్ ను, అయన బాడీ లాంగ్వేజ్ ను చాల మంది వాడుకుంటున్నారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా తన వ్యక్తిత్వాన్ని వాడుకుంటున్నారని జాకీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నటుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జాకీ యొక్క పిటిషన్ ప్రకారం, అతను తన పేరు, భిడు పదం యొక్క ఉపయోగంపై ఢిల్లీ హైకోర్టు నుండి అధికారాన్ని కోరుకున్నాడు.

"కొందరు నా పేరు, వాయిస్‌, పర్సనాలిటి వాడుకుంటున్నారు. కొన్ని అనాధికారికంగా కొన్ని సంస్థలు నాపేరు భీడు, వాయిస్‌, ఫోటోలతో ప్రచారం చేసుకుంటున్నాయి. కొందరైతే నా వాయిస్‌ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక పర్సనాలిటీపై సోషల్‌ మీడియాలో కొన్ని మీమ్స్‌ కూడా వస్తున్నాయి. ఇది నా వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నా గుర్తింపుకు రక్షణ కల్పించాలి" అని జాకీ ష్రాఫ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
 
మే 14న ఆయన ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అనుమతి లేకుండా పేరు, ఫోటో, వాయిస్, భీడు అనే పదం వాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, 2 కోట్ల రూపాయల జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ప్రస్తుతం నిందితులందరికీ సమన్లు ​​జారీ చేసింది, నటుడి వ్యక్తిగత హక్కులు ఉల్లంఘించబడిన అన్ని లింక్‌లను తొలగించాలని MEITY (టెక్నాలజీ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ)ని ఆదేశించింది . 

మే 15న అంటే ఈ రోజు  కోర్టు తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తన ప్రతిష్ట దెబ్బతింటోందని జాకీ తరపు లాయర్ ప్రవీణ్ ఆనంద్ కోర్టుకు తెలిపారు. అసభ్యకరమైన మీమ్స్‌లో అతని పేరు దుర్వినియోగం అవుతోందని, ఆయన వాయిస్‌ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ హక్కులకు భంగం వాటిల్లకుండా ఆపాలని డిమాండ్‌ చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios