Asianet News TeluguAsianet News Telugu

హాస్పటల్ లో రాఖీ సావంత్...అపస్మారక స్థితిలో ?

 రాఖీకి గుండె సంబంధిత సమస్య ఉందని, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారని మీడియా కథనాలు చెబుతున్నాయి. రాఖీ అభిమానులు ఆమె భద్రత కోసం ప్రార్థనలు చేస్తున్నారు. 

Rakhi Sawant Hospitalised In Mumbai Due To Serious Heart Problem jsp
Author
First Published May 15, 2024, 7:53 AM IST

ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో వార్తల్లో నిలిచే  రాఖీ సావంత్‌ హాస్పటిల్ పాలైంది.  టీవీ నటి – రియాలిటీ షో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అయిన రాఖీ అత్యవసరంగా ఆసుపత్రిలో చేరినట్లు చెబుతున్నారు. ఆమె తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు కూడా రిపోర్ట్ లతో కూడిన వార్తలు  బయటకు వస్తున్నాయి.  ఈ  నేపధ్యంలో ఈ వార్త అభిమానులను షాక్‌కి గురి చేసింది. ఆమె భద్రత కోసం అందరూ ప్రార్థిస్తున్నారు. హిందీ పాపరాజీ ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాఖీ సావంత్ యొక్క కొన్ని ఫోటోలను షేర్ చేశారు. 

ఆఆమె ఆసుపత్రిలో కనిపిస్తోంది. వాటిలో రాఖీ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉంది. ఒక వేలికి ఆక్సిమీటర్, మరొక చేతికి వైగో జోడించబడి ఉంది. ఆ కారణంగా ఆమెకు గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. అలాగే మరో  పిక్ లో నర్సు ఆమెకు BP (రక్తపోటు) తనిఖీ చేస్తోంది. ఈ ఫొటోలు చూసిన వారంతా  కంగారుపడుతూ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. రాఖీకి గుండె సంబంధిత సమస్య ఉందని, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారని మీడియా కథనాలు చెబుతున్నాయి. రాఖీ అభిమానులు ఆమె భద్రత కోసం ప్రార్థనలు చేస్తున్నారు. 

అయితే రాఖీ సావంత్ ఇన్​స్టాలో మాత్రం కొన్ని గంట క్రితం కూడా ఫన్నీ రీల్‌ను షేర్ చేసినట్టుగా కనిపిస్తోంది. నిన్నంతా ఆమె టవల్​ ధరించి వింత వింత పోజులు ఇస్తూ, అలానే డిఫరెంట్​ ఔట్ ఫిట్‌ ధరించి హంగామా చేసినట్టుగా ఆ ఇన్​స్టా స్టోరీస్​ చూస్తే తెలుస్తోంది.ఇక రాఖీ సావంత్ బాలీవుడ్​లో ఫుల్​ పాపులర్​. ఫోటో గ్రాఫర్లతో ఆమె చేసే ఫన్, వారి కెమెరాలుకు రకరకాల ఔట్​ఫిట్లను ధరించి ఆమె ఇచ్చే పోజులు ఎప్పుడూ ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి. అలా తన భారీ అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ కూడా ఉంటుంది. ఉర్ఫీతో కలిసి ఆమె చేసే అల్లరి, వేసుకునే డ్రెస్సులపై ఎక్కువగా నెట్టింట్లో చర్చలు కూడా జరుగుతుంటాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios