Asianet News TeluguAsianet News Telugu

డబల్ ఇస్మార్ట్ టీజర్ రివ్యూ: ఈసారి డబల్ క్రాక్ చూపించేలా ఉన్నాడే, హైలెట్స్ ఇవే!

రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ డబల్ ఇస్మార్ట్. నేడు ఆయన బర్త్ డే కాగా టీజర్ విడుదల చేశారు. రామ్ పోతినేని ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా టీజర్ ఉంది. 
 

hero ram pothineni birthday special double ismart teaser out now ksr
Author
First Published May 15, 2024, 10:52 AM IST

2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ దర్శకుడు పూరి జగన్నాధ్ కి అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. రామ్ పోతినేని సైతం ఇస్మార్ట్ శంకర్ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇస్మార్ట్ శంకర్ వరల్డ్ వైడ్ రూ. 75 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. నిర్మాతలైన ఛార్మి-పూరి లకు ఇస్మార్ట్ శంకర్ కాసులు కురిపించింది. లైగర్ తో మళ్ళీ డల్ అయిన పూరి జగన్నాధ్.. అచ్చొచ్చిన హీరోతో మూవీ చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ ప్రకటించారు. 

ప్రకటనతోనే డబల్ ఇస్మార్ట్ మూవీ ప్రచారం దక్కించుకుంది. నేడు రామ్ పోతినేని జన్మదినం పురస్కరించుకుని డబల్ ఇస్మార్ట్ టీజర్ విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి కలిగిన డబల్ ఇస్మార్ట్ టీజర్ ఆకట్టుకుంది. మాస్ రోల్ లో రామ్ పోతినేని బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ ఫుల్ కిక్ ఇచ్చాయి. డైలాగ్స్ లో బూతుల డోసు ఎక్కువగానే ఉంది. సంజయ్ దత్ టీజర్ కి హైలెట్ అని చెప్పాలి. క్లాస్ విలన్ గా ఆయన లుక్ ఆసక్తి రేపుతోంది. 

దర్శకుడు పూరి జగన్నాధ్ ఓ అద్భుతమైన పాత్ర సంజయ్ దత్ కోసం రాశాడనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ మరో హైలెట్ అం చెప్పాలి. మొత్తంగా డబల్ ఇస్మార్ట్ టీజర్ మెప్పించింది. సినిమాపై అంచనాలు పెంచేసింది. రామ్ పోతినేని ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు టీజర్లో ఉన్నాయి. మణిశర్మ బీజీఎమ్ బాగుంది. 

రామ్ పోతినేనికి జంటగా కావ్య థాపర్ నటిస్తుంది. మరి ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత పూరి జగన్నాధ్, రామ్ పోతినేనిలకు హిట్ లేదు. డబల్ ఇస్మార్ట్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది. రామ్ పోతినేని గత చిత్రం స్కంద ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. డబల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల కానుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios