- Home
- Entertainment
- దుమ్మురేపుతున్న ప్రభాస్ సూపర్ స్టైలిష్ లుక్.. నెట్టింట వైరల్ అవుతున్న డార్లింగ్ న్యూ పిక్..
దుమ్మురేపుతున్న ప్రభాస్ సూపర్ స్టైలిష్ లుక్.. నెట్టింట వైరల్ అవుతున్న డార్లింగ్ న్యూ పిక్..
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా సినిమాకు తన బాడీలో ఛేంజ్ చూపిస్తూ వస్తున్నాడు. ‘బహుబలి’ తర్వాత డార్లింగ్ బాడీ ట్రాన్స్ ఫామింగ్ వేరే లెవల్ లో ఉంది. అయితే తాజాగా ఇంటర్నెట్ లో ప్రభాస్ లేటెస్ట్ ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బహుబలి’తో ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా లెవల్లో పెరిగింది. అంతేకాకుండా పలు దేశాల్లోనూ ప్రభాస్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. డార్లింగ్ అంటే పడిచచ్చే అభిమానులు కోట్లల్లో ఉన్నారు.
మొత్తంగా ప్రభాస్ (Prabhas) ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే రానున్న రోజుల్లో ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం ఆయన మూడు భారీ సినిమాలు చేస్తున్నారు. మరో రెండు సినిమాలు ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే బహుబలి నుంచి ప్రభాస్ తన ఫిజికల్ ఫిట్ నెస్ పై చాలా ఫోకస్ పెడుతున్నారు. అలాగే గ్లామర్ పైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. బహుబలి కోసం ఏకంగా 120 కిలోల బరువు పెరిగిన ప్రభాస్ ఆ తర్వాత వెంటనే మళ్లీ మొత్తం బరువును దించేశాడు. ఇలా సినిమా సినిమాకు తన ఫిజికల్ ఫిట్ నెస్ లో చాలా మార్పులను చూపిస్తూ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నారు.
సాహో, రాధే శ్యామ్ చిత్రాల్లో ప్రభాస్ చాలా బొద్దుగా కనిపించారు. వరుసగా సినిమాల్లో నటిస్తుండటంతో సమయం లేకపోవడంతో సరైన ఎక్సర్ సైజ్ లు చేయకపోవడంతో అలా బొద్దుగా కనిపించాడని, మరోవైపు ప్రభాస్ తన బాడీపై అశ్రద్ధ వహిస్తున్నారంటూ కూడా కామెంట్స్ వినిపించాయి. వీటన్నింటికి ప్రస్తుతం బదులిచ్చాడు ప్రభాస్.
ప్రభాస్ లేటెస్ట్ పిక్ ఒకటి ప్రస్తుతం నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది. ఈ పిక్ లో ప్రభాస్ న్యూ లుక్ లో అదరగొట్టాడు. చెక్స్ షర్ట్ ధరించిన డార్లింగ్ చాలా స్లిమ్ గా, ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఫేస్ లోనూ అట్రాక్టివ్ గ్లో కనిపిస్తోంది. స్టైషిల్ హెయిర్ స్టైయిల్ క్యాప్, సన్ గ్లాసెస్ పెట్టుకుని మతిపోగొడుతున్నాడు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డార్లింగ్ తన అభిమానుల కోసం తాజాగా పలు ఫొటోలకు ఫోజులిచ్చాడు. వారితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ, సరదగా మాట్లాడటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆ పిక్స్ ను ట్విట్టర్ లో షేర్ చేయడంతో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ న్యూ లుక్ వేరీ స్టైలిష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చాలా యంగ్ గా కనిపిస్తున్నాడంటూ ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.