రామ్ చరణ్ కూతురు క్లిన్ కారకు ప్రభాస్ గిఫ్ట్... డార్లింగ్ ఏం పంపాడో తెలుసా?
రామ్ చరణ్ కూతురు క్లిన్ కారకు ప్రభాస్ గిఫ్ట్ పంపగా ఉపాసన మురిసిపోయింది. ఇంతకీ డార్లింగ్ ప్రభాస్ క్లిన్ కారకు ఇచ్చిన బహుమతి ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Ram Charan - Upasana
రామ్ చరణ్-ఉపాసనల గారాలపట్టి క్లిన్ కార. పెళ్ళైన పదేళ్లకు పుట్టిన పాపాయి కావడంతో అత్యంత ప్రేమగా చూసుకుంటున్నారు. చరణ్-ఉపాసన ఎక్కడికి వెళ్లినా ఉపాసన ఉండాల్సిందే. క్లిన్ కార కోసం ఇంట్లో ఓ గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. క్లిన్ కార కేర్ టేకర్ కి లక్షల జీతం ఇస్తున్నారు.
కాగా క్లిన్ కారకు ప్రభాస్ బహుమతి పంపడం విశేషత సంతరించుకుంది. ఇంతకీ ఆ బహుమతి ఏంటి? అందులో ఏముందని పరిశీలిస్తే... ఇది పూర్తిగా పబ్లిసిటీ స్టంట్. కల్కి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కల్కి టీమ్ చరణ్ కూతురు క్లిన్ కారకు గిఫ్ట్స్ పంపారు.
Prabhas
ఆ గిఫ్ట్ ప్యాక్ లో ఏముందని గమనిస్తే... కల్కి బుజ్జి బొమ్మ, స్టిక్కర్స్ , టీ షర్ట్ ఉన్నట్లు సమాచారం. కల్కి టీమ్ పంపిన బొమ్మలతో క్లిన్ కార ఆడుకుంటున్న ఫోటోను ఉపాసన తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. అలాగే కల్కి టీమ్ కి ఉపాసన ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఉపాసన పోస్ట్ వైరల్ అవుతుంది.
మరికొందరు సెలబ్రిటీల పిల్లలకు కూడా కల్కి గిఫ్ట్స్ పంపనున్నట్లు తెలుస్తుంది. కల్కి చిత్రానికి ప్రచారం కల్పించడం కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నారు టీమ్ సభ్యులు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. బుజ్జి అండ్ భైరవ టైటిల్ తో యానిమేషన్ ఎపిసోడ్ ప్రైమ్ లో విడుదల చేశారు.
భారీ బడ్జెట్ తో కల్కి చిత్రం తెరకెక్కింది. ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక రోల్స్ చేస్తున్నారు. దిశా పటాని మరొక హీరోయిన్ గా చేస్తుంది. జూన్ 27న కల్కి వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది.