MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు

Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో 9 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఓకే అయినట్టు సమాచారం. ఇందులో మంచి గ్లామర్‌ ఉంది, కమెడియన్లు కూడా ఉన్నారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 26 2026, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి క్రేజీ కంటెస్టెంట్లు
Image Credit : youtube/@StarMaaOfficial

బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి క్రేజీ కంటెస్టెంట్లు

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం కామనర్స్ ని ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతుంది. ఈ వారాంతంలో కామనర్స్ ఎవరు రాబోతున్నారనేది క్లారిటీ రాబోతుంది. మొదటగా ఐదుగురు కంటెస్టెంట్లని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్లకి సంబంధించిన పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఈ సారి క్రేజీ కంటెస్టెంట్లు రాబోతున్నారు. గ్లామర్‌కి మాత్రం కొదవ లేదు. అదిరిపోయే ట్రీట్‌ వస్తోంది. ఇంకోవైపు కామెడీని పంచేందుకు కూడా పలువురు కమెడియన్లని దించుతున్నారట. కామెడీకి అడ్డగా మారిన కమెడియన్లు హౌజ్‌లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి రాబోతున్న గ్లామర్‌ బ్యూటీస్‌
Image Credit : Instagram/Debjani Modak

బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి రాబోతున్న గ్లామర్‌ బ్యూటీస్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి రాబోతున్న వారికి సంబంధించి కొందరు కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. దాదాపు తొమ్మిది మంది సెలబ్రిటీలు కన్ఫమ్‌ అంటున్నారు. వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అందులో క్రేజీ ఆర్టిస్ట్ లు ఉన్నారు. సీరియల్‌ నటి దేబ్జానీ మోదక్‌ ఉండటం విశేషం. ఆమె బుల్లితెరపై స్టార్‌ నటిగా రాణిస్తోన్న విషయం తెలిసిందే. ఆమెతోపాటు మరో హాట్‌ బాంబ్‌ వార్షిణి సౌందరాజన్‌ కూడా ఉన్నారు. అలాగే మరో నటి చైత్ర రాయ్‌ కూడా బిగ్‌ బాస్‌ హౌజ్‌ లోకి రాబోతుందని సమాచారం.

35
ఈ సారి ఫుల్‌ కామెడీ కూడా ఉండబోతుంది
Image Credit : our own

ఈ సారి ఫుల్‌ కామెడీ కూడా ఉండబోతుంది

వీరితోపాటు హీరో త్రిగుణ్‌, కృష్ణుడు, ముఖేష్‌ గౌడ ఉన్నారు. అలాగే విలన్‌ రోల్స్ తో ఆకట్టుకుంటున్న టెంపర్‌ వంశీ కూడా హౌజ్‌లోకి రాబోతున్నట్టు సమాచారం. వీరితోపాటు జబర్దస్త్ నుంచి ఇద్దరు కమెడియన్లు రాబోతున్నారు. రాం ప్రసాద్‌, నరేష్‌ కూడా బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. గత సీజన్ లో ఇమ్మాన్యుయెల్‌ కామెడీతో ఆకట్టుకున్నాడు. ఈ సారి ఇద్దరు రాబోతున్నారట. ప్రస్తుతం ఈ 9 మంది కంటెస్టెంట్లు ఓకే అయ్యారని అంటున్నారు. మరి ఫైనల్‌గా వీరిలో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరనేది చూడాలి.

45
సెప్టెంబర్‌ 6న బిగ్‌ బాస్‌ తెలుగు 10 ప్రారంభం
Image Credit : x/@starmaa

సెప్టెంబర్‌ 6న బిగ్‌ బాస్‌ తెలుగు 10 ప్రారంభం

నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న ఈ బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ సెప్టెంబర్‌ 6న ప్రారంభం కానుంది. దాదాపు 15 మంది కంటెస్టెంట్లతో దీన్ని స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యలో ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్లని హౌజ్‌లోకి పంపించబోతున్నారట. బిగ్‌ బాస్‌ తెలుగు 9 సీజన్‌ మాదిరిగానే ఇప్పుడు చేయబోతున్నట్టు సమాచారం. మరి గత సీజన్‌ ఎండింగ్‌లో మంచి సక్సెస్‌ అయ్యింది. ఇప్పుడు ఎలా ఉండబోతుందనేది చూడాలి.

55
టాప్‌లో ఉన్న కామనర్స్ వీరే
Image Credit : youtube/@starmaa

టాప్‌లో ఉన్న కామనర్స్ వీరే

ఇక కామన్‌ మ్యాన్‌ కేటగిరిలో `అగ్నిపరీక్ష` ద్వారా కామనర్స్ ని ఎంపిక చేస్తున్నారు. రోహిత్‌ నాయుడు, రాజకుమారి, అమన్‌, చరణ్‌, ఝాన్సీ, మిథిలేష్‌, అపూర్వ, షాలిని, శ్రష్టి, రామకృష్ణ, దీపక్‌, హేమంత్‌, ప్రియాంక, భాగి, గాయత్రి టాప్‌ 15లో ఉన్నారు. వీరిలో హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరనేది చూడాలి. ఓటింగ్‌ ద్వారా వీరిని ఫైనలైజ్‌ చేస్తారు. ఇది ఈ వారంలో క్లారిటీ వస్తుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ragini: 13 ఏళ్లకే పెళ్లి, 14 ఏళ్లకు కొడుకు.. భర్త వదిలేసి వెళ్లిపోయాడు.. నటి రాగిణి లైఫ్‌లో ఇన్ని కష్టాలు ఉన్నాయా?
Recommended image2
Gunasekhar: ఒక్కడు తర్వాత ఆ మూవీ చేయాల్సింది, హేళన చేశారు.. ఎన్టీఆర్ తో రిస్క్ అన్నారు, డైరెక్టర్ కామెంట్స్
Recommended image3
Prabhas: ప్రభాస్‌కు విపరీతంగా కోపం తెప్పించే ఏకైక వ్యక్తి ఎవరు? రాజమౌళి చెప్పిన రహస్యం..
Related Stories
Recommended image1
Toxic Movie Review: టాక్సిక్‌ మూవీ రివ్యూ.. యష్‌, నయనతార, రుక్మిణి వసంత్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved