డైమండ్‌లా మెరిసిపోతున్న పూజా హెగ్డే అందాలు.. దగదగ మెరుస్తూ హోయలు.. అబ్బ ఇంత అందమా!
బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్లామర్ ఫోటో షూట్లు చాలా చూశాం. ఆమె డస్కీ అందాలతో హోయలు పోతే ఏకంగా ఇంటర్నెట్ మొత్తం ఊపేస్తుంటుంది. కానీ తాజాగా ఆమె అందాలు ప్రకాశిస్తున్నాయి.

పూజా హెగ్డే డైమండ్‌లా మెరిసిపోతుంది. మెడలో వజ్రాల హారం ధరించి హోయలు పోయింది. నీలిరంగు గౌనులో కనువిందు చేస్తుంది. జబ్బలపై గౌను జారిపోతుండగా ఆమె ఇచ్చిన పోజులు ఇప్పుడు నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వడం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
అయితే ఓ డైమండ్ జ్యూవెల్లరి యాడ్ ప్రమోషన్‌లో భాగంగా పూజా హెగ్డే ఇలా అందంగా ముస్తాబై కనువిందు చేస్తుంది. ఆకాశం నుంచి దిగివచ్చిన దేవకన్య మాదిరిగా ఆద్యంతం కట్టిపడేస్తుంది పూజా. పూజా అభిమానులను ఈ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.
పూజా హెగ్డే తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుందీ అందాల భామ. స్టార్ హీరోలందరితోనూ ఆడి పాడుతుంది. మహేష్‌బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాగచైతన్య వంటి హీరోలందరితోనూ నటించి ఆకట్టుకుంది. విజయాలను అందుకుంది.
త్వరలో ఆమె పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న `ఉస్తాద్ భగత్‌సింగ్` చిత్రంలో నటించనుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల బాలీవుడ్‌లో `సర్కస్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈసినిమా డిజప్పాయింట్ చేసింది.
ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్‌తో సినిమా చేస్తుంది. అయితే చాలా రోజులుగా బాలీవుడ్‌లో రాణించాలని ప్రయత్నిస్తుంది పూజా. కానీ సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు. అడపాదడపా సినిమా ఛాన్స్ లైతే వస్తున్నాయి, కానీ హీరోయిన్‌గా గుర్తింపు దక్కడం లేదు. మరి ఇప్పుడు సల్మాన్ తో చేస్తున్న `కిసి కా భాయ్ కిసి కి జాన్` చిత్రంతోనైనా సక్సెస్ వరిస్తుందేమో చూడాలి.
పూజా హెగ్డే ఈ ఏడాది ముందు వరకు గోల్డెన్ లెగ్‌గా చెలామణి అయ్యింది. ఆమె నటించిన ప్రతి సినిమా విజయం సాధించింది. దీంతో లక్కీ ఛార్మ్ గా నిలిచింది. కానీ ఈ ఏడాది పూజాకి కలిసి రాలేదు. నటించిన అన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. `రాధేశ్యామ్`, `ఆచార్య`, `బీస్ట్`, ఇప్పుడు `సర్కస్` వరుసగా పరాజయాలను చవిచూశాయి.