MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ

Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ

Veta Movie: చిరంజీవి హీరోగా వచ్చిన `వేట` మూవీ ఎంతటి సంచలనాలు క్రియేట్‌ చేసిందో తెలిసిందే. ఇప్పుడు నలభై ఏళ్ల తర్వాత అదే పేరుతో మరో సంచలనాత్మక మూవీ రాబోతుంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 31 2026, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
వేటతో సంచలనాలు సృష్టించిన చిరంజీవి
Image Credit : stockPhoto

వేటతో సంచలనాలు సృష్టించిన చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో హిట్‌గా నిలిచిన చిత్రాల్లో `వేట` ఒకటి. ఈ మూవీ చిరంజీవి కెరీర్‌లో ఒక ప్రత్యేకంగా నిలుస్తుంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిరు సరసన సుమలత హీరోయిన్‌గా చేసింది. జయప్రద కీలక పాత్రలో మెరిసింది. అప్పట్లో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా రాబోతుంది. 2008లో `వేట` పేరుతో బాలదిత్య సినిమా చేశారు. ఇప్పుడు మరో మూవీ కాబోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
40 ఏళ్ల తర్వాత వేట పేరుతో సినిమా
Image Credit : Asianet News

40 ఏళ్ల తర్వాత వేట పేరుతో సినిమా

`వేట` పేరుతో కొత్త సినిమా సోమవారం విడుదలైంది. ఇందులో సందీప్‌ సరోజ్‌, సాత్విక్‌ జంటగా నటించారు. అశోక్‌ కోటిపల్లి దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేట’ చిత్రానికి ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాతలు. ఈ చిత్రం నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా, కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

కొత్త వాళ్లతో `వేట` షురూ

ఈ సందర్భంగా చిత్ర హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ, `కమిటీ కుర్రోళ్లు` చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను. ఈ రోజు మా కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన నాగబాబు గారికి, ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘వేట’ అనేది చిరంజీవి గారి టైటిల్. మా ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది. మా సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను` అని అన్నారు. కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ, `డైరెక్టర్ అశోక్ చెప్పిన `వేట` కథ నాకు అద్బుతంగా అనిపించింది. అందరూ కొత్త వాళ్లు కలిసి పని చేస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో ఊర్లో పెద రాయుడు టైపు పాత్ర నాది. నా కారెక్టర్ నాకు నచ్చింది. జెన్ జీ ఆడియెన్స్‌కి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఈ మూవీ బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను` అని అన్నారు. దర్శకుడు అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ, `ఇదే నా మొదటి సినిమా. కథ చెప్పిన వెంటనే కేఎస్ రవి కుమార్ గారు అంగీకరించారు. ఈ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఈటీవీ విన్ టీంకు థాంక్స్’ అని అన్నారు.

కమిటీ కుర్రోళ్లు మాదిరిగానే..

నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ .. ‘‘ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్నారు. కేఎస్ రవి కుమార్ మా సినిమాలో గొప్ప పాత్రను పోషించనున్నారు. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్న కల్కి రాజా గారికి థాంక్స్. మాకోసం వచ్చిన నాగబాబు గారు, సాయి రాజేష్ గారు, మెహర్ రమేష్ గారు, వీఎన్ ఆదిత్య గారు, ఎస్‌కేఎన్ గారికి థాంక్స్. నా సినీ జర్నీలో సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. ‘కమిటీకుర్రోళ్లు’ చిత్రంలానే ఇది కూడా ఓ గ్రామీణ కథ. అశోక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సినిమా ఎంతో సహజంగా ఉంటూనే కమర్షియల్ పంథాలో ఉంటుంది’ అని అన్నారు. సాత్విక మాట్లాడుతూ .. ‘వేట’ సినిమా నా కెరీర్‌లో గొప్ప ప్రారంభంగా మారుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi Movies: నాగ చైతన్య మూవీ తర్వాత గ్యాప్.. త్వరలో డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న సాయి పల్లవి
Recommended image2
Annayya Movie: చిరంజీవికి చెప్పి హీరోయిన్లని మార్చుకున్న యంగ్ హీరోలు..బాబోయ్ వాళ్ళు మాకు వద్దు అంటూ కంప్లైంట్
Recommended image3
Suma Kanakala: రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ చేస్తే.. సుమ కనకాల రియాక్షన్ ఏంటి? క్లారిటీ ఇచ్చిన రాజీవ్!
Related Stories
Recommended image1
Agnipariksha: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు ఫైనల్‌.. బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వెళ్లే కామనర్స్ వీళ్లే?
Recommended image2
Toxic 5 Days Collections: విజయ్ సినిమా రికార్డు బ్రేక్ చేసిన యశ్‌.. 'టాక్సిక్' కలెక్షన్ల సునామీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved