MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • సడెన్‌గా ఓటీటీలోకి వస్తోన్న పాన్ ఇండియా డిజాస్టర్‌ మూవీ.. అక్కడైనా పట్టించుకుంటారా?

సడెన్‌గా ఓటీటీలోకి వస్తోన్న పాన్ ఇండియా డిజాస్టర్‌ మూవీ.. అక్కడైనా పట్టించుకుంటారా?

ఇటీవల చిన్నా, పెద్ద సినిమాలు పది వారాల నిబంధనని బ్రేక్‌ చేస్తూ మూడు, నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్నాయి. అలా ఇప్పుడు పాన్‌ ఇండియా డిజాస్టర్‌ చిత్రం రాబోతుంది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 04 2024, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bharateeyudu 2

Bharateeyudu 2

 లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందిన `భారతీయుడు 2` చిత్రం గత నెలలోనే థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.  అయితే ఓపెనింగ్స్ బాగానే ఉన్నా, రెండో రోజు నుంచే డిజాస్టర్‌గా నిలిచింది. ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో ఆడియెన్స్ రిజెక్ట్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కమల్‌ హాసన్‌ నటనతో మ్యాజిక్‌ చేసినా లుక్స్ సెట్ కాలేదు. మేకప్‌ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో విమర్శలు వచ్చాయి. పైగా సినిమా లెన్త్ కూడా పెరిగింది. శంకర ఏమాత్రం కొత్తదనం చూపించలేకపోయాడు. ఆల్‌రెడీ జనం చూస్తున్నది, ఫేస్‌ చేస్తున్నదే అందులో చూపించారు. రొటీన్‌ ఫీలయ్యారు ఆడియెన్స్. మొత్తంగా `భారతీయుడు 2` ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. 
 

35

ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. విడుదలై నెల రోజులు కూడా కాలేదు. ఓటీటీలో వస్తుంది. గత నెల 12న సినిమా విడుదల కాగా, ఇప్పుడు ఆగస్ట్ 9నే ఓటీటీలోకి రాబోతున్నట్టు ప్రకటించింది టీమ్‌. నెట్‌ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఈ శుక్రవారం నుంచి తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‌ కానుంది. 
 

45
Bharateeyudu 2 Review

Bharateeyudu 2 Review

ఇదిలా ఉంటే ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించి నెట్ ఫ్లిక్స్ 120కోట్లకి రైట్స్ తీసుకుంది. కానీ సినిమా విడుదలయ్యాక సీన్‌ మొత్తం మారింది. థియేట్రికల్‌గా నిరాశపర్చడంతో, ఓటీటీలోనూ ఆదరణ కష్టం అని భావించిన ఓటీటీ సంస్థ.. ఒప్పందంలోకోత పెట్టిందట. సుమారు 50కోట్లు ఎగ్గొట్టిందట. కేవలం 70కోట్లు మాత్రమే చెల్లించిందని తెలుస్తుంది. దీంతో ఇది నిర్మాత లైకా ప్రొడక్షన్‌కిది భారీ నష్టమనే చెప్పాలి. 
 

55
Bharateeyudu 2 Review

Bharateeyudu 2 Review

ఇక కమల్‌ హాసన్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన `భారతీయుడు 2` సినిమాలో సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా, ఎస్‌జే సూర్య ముఖ్య పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్‌ నిర్మించింది. జులై 12న ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. అయితే దీనికి మరో పార్ట్ కూడా ఉంది. `భారతీయుడు 3` కూడా త్వరలో రాబోతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో దీన్ని విడుదల చేసేందుకు టీమ్‌ ప్లాన్‌ చేస్తుంది. దీనికి ప్రీక్వెల్‌ గా ఈ సినిమా రాబోతుంది.  
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image2
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image3
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved