MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరు, బాలయ్య చిత్రాలపై ఎన్టీఆర్ కామెంట్.. అమిగోస్ ప్రీరిలీజ్ లో తారక్ నెక్స్ట్ మూవీపై అదిరిపోయే అప్డేట్

చిరు, బాలయ్య చిత్రాలపై ఎన్టీఆర్ కామెంట్.. అమిగోస్ ప్రీరిలీజ్ లో తారక్ నెక్స్ట్ మూవీపై అదిరిపోయే అప్డేట్

బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 05 2023, 09:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాజేంద్ర రెడ్డి దర్శకుడు కాగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే తొలిసారి ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి కళ్యాణ్ రామ్ సోదరుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అభిమానుల కేరింతల మధ్య తన ప్రసంగాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారు. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు. బాడీ పైన్స్ ఉన్నాయి. కాబట్టి గోల చేయవద్దు అంటూ తారక్ తన స్పీచ్ ప్రారంభించారు. 

 

36

ముందుగా ఈ చిత్ర దర్శకుడు రాజేంద్రగారి గురించి చెప్పాలి. ఆయన ఇంజనీరింగ్ చదివారు. ఇంట్లో వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేయమని చెప్పినా సినిమాపై పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చారు. కానీ ఆయనకి దర్శకుడిగా అవకాశం వచ్చే సరికే వాళ్ళ అమ్మగారు మరణించారు. సినిమా పూర్తయ్యే సరికి నాన్నగారు కూడా లేదు. అప్పుడు అనిపించింది సినిమా అంటే ఇంత పిచ్చా అని. రాజేంద్ర గారి అమ్మా నాన్న ఎక్కడికీ వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నారు. మీకు వారి ఆశీస్సులు ఉంటాయి అని ఎన్టీఆర్ కామెంట్స్ చేశారు. 

46

ఇక ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ వారు నాకు కుటుంబ సభ్యులే. వాళ్లపై జోకులు వేస్తుంటా. వీళ్ళకి సుడి బాగా ఉంది అని అంటుంటా. 85 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు పరిశ్రమలో ఒకే సారి రెండు పెద్ద చిత్రాలని రిలీజ్ చేయడం.. రెండూ సూపర్ హిట్స్ కావడం వాళ్ళకే చెల్లింది అంటూ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల్ని ఉద్దేశించి తారక్ కామెంట్స్ చేశారు. 

56

తన సోదరుడు కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడుతూ.. మా ఫ్యామిలిలో ప్రయోగాత్మక చిత్రాలు చేసింది కళ్యాణ్ రామ్ అన్న ఒక్కడే. నేను అనుకునేవాడిని.. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రలేనా.. కళ్యాణ్ అన్న మాస్ చిత్రాలు చేయడా అని. అతనొక్కడే, పటాస్ తర్వాత బింబిసారా చిత్రం ఆకలి మొత్తం తీర్చేసింది. ఇప్పుడు అమిగోస్ తో రాబోతున్నారు. ఈ చిత్రానికి కూడా మీ సపోర్ట్ కావాలి. 

66

ఇక ఫ్యాన్స్ ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలని గోల చేస్తుంటే కొంచెం క్లాస్ పీకి వారి కోరిక తీర్చాడు. ప్రతి రోజూ సినిమా గురించి అప్డేట్ ఇవ్వడం కుదరదు. మీరు అలా గోల చేయడం వల్ల దర్శకుడిపై, నిర్మాతలపై ఒత్తిడి పెరుగుతుంది. దయచేసి ఎదురుచూడండి. ఒకవేళ అప్డేట్ ఉంటే మా భార్య కంటే ముందే మీకు చెబుతా. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాయి. నా నెక్స్ట్ మూవీని ఈ నెలలోనే లాంచ్ చేస్తున్నాం. మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ 5, 2024న రోలీజ్ అంటూ ఎన్టీఆర్ అభిమానులని ఖుషి చేశాడు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: 88 ఏళ్ల వయసులో 23 ఏళ్ల హీరోయిన్ పై ఏఎన్నార్ రొమాంటిక్ కామెంట్స్, మిల్క్ బ్యూటీపై మనసుపడ్డ హీరో..
Recommended image2
Karthika Deepam 2 Today Episode: సూరజ్, జ్యోల పూజ-వరుస కలిపిన మాలిని-దీపకు మాలిని ఆఫర్-కార్తీక్ షాక్
Recommended image3
Janhvi Kapoor: సింపుల్ గా కనిపిస్తున్న జాన్వీ కపూర్ వాచ్ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? షాక్ అవుతారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved