Janhvi Kapoor: లేలేత పరువాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ... ప్యారిస్ వీధుల్లో జాన్వీ చక్కర్లు!
జాన్వీ కపూర్ ప్యారిస్ వెళ్లినట్లున్నారు. ఫ్యాషన్ నగరంలో ఎంజాయ్ చేస్తున్న జాన్వీ తన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.
Janhvi Kapoor
షూటింగ్స్ విరామం ప్రకటించి విదేశాలకు చెక్కేసింది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఆమె ప్యారిస్ నగరంలో ఉన్నట్లు సమాచారం. తన టూర్ కి సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. జాన్వీ కపూర్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది.
Janhvi Kapoor
ఎట్టకేలకు జాన్వీ కపూర్ కి హిట్ పడింది. జులై 21న హాట్ స్టార్ లో విడుదలైన బవాల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బవాల్ విజయాన్ని జాన్వీ ఆస్వాదిస్తున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో విడుదలై ఉంటే జాన్వీ కెరీర్ కి ప్లస్ అయ్యేది. జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ లు జంటగా నటించారు
Janhvi Kapoor
నితేశ్ తివారి దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఫిల్మ్ క్రిటిక్స్ బవాల్ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆడియన్స్ సైతం పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
Janhvi Kapoor
కాగా జాన్వీ దేవర మూవీతో సౌత్ ఇండియా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఆమెకు గుర్తింపు ఉంది. గతంలో పలువురు మేకర్స్ ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేశారు. దర్శకుడు కొరటాల శివ ఇది సాకారం చేసి చూపారు. దేవరలో ఎన్టీఆర్-జాన్వీ జంటగా కనిపించనున్నారు.
Janhvi Kapoor
సీనియర్ ఎన్టీఆర్-శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబోలో బాక్ బస్టర్స్ వచ్చాయి. మరి వారి వారసులైన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కలిసి నటించడం ఊహించని పరిణామం. ఈ కాంబో ఉంటుందని చాలాకాలంగా చర్చ జరుగుతుంది. దేవర మూవీతో కార్యరూపం దాల్చింది.
Janhvi Kapoor
యాక్షన్ ఎంటర్టైనర్ దేవర వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే నిరవధికంగా చిత్రీకరణ పూర్తి చేయనున్నారట. దేవర ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పించింది.
Janhvi Kapoor
దేవర విజయం సాధిస్తే జాన్వీ కపూర్ దశ తిరిగినట్లే. ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తే అవకాశం ఉంది. ఆల్రెడీ రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఓ తమిళ సినిమాలో జాన్వీ నటించే అవకాశం కలదట.
Janhvi Kapoor
జాన్వీ కపూర్ ప్యారిస్ వెళ్లినట్లున్నారు. ఫ్యాషన్ నగరంలో ఎంజాయ్ చేస్తున్న జాన్వీ తన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.