- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: భర్తను బయటకు తరిమెసిన తులసి.. మరో షాకింగ్ ప్లాన్ తో వచ్చిన భాగ్య!
Intinti Gruhalakshmi: భర్తను బయటకు తరిమెసిన తులసి.. మరో షాకింగ్ ప్లాన్ తో వచ్చిన భాగ్య!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

తులసి (Tulasi) భార్యగానే కాదు తల్లిగా కూడా నేను ఫెయిల్యూర్ అని ఒకప్పుడు కితాబిచ్చావు అని నందు (Nandhu) ని అంటుంది. అంతేకాకుండా నా గురించి పక్కన పెట్టి ఒకసారి మీ గురించి తనివితీరా మాట్లాడుకుందామా మిస్టర్ నందగోపాల్ గారు అని తులసి నందుని దెప్పి పొడిచినట్లుగా మాట్లాడుతుంది.
అదే క్రమంలో ఒక్క రోజు నన్ను సినిమాకు తీసుకెళ్లినట్లు లేదు. ఒక్క రోజు మూరెడు మల్లె పూలు తెచ్చినట్టు లేదు. భార్య అంటే ఆయన ముందు ఒక లాప్ టాప్ లాంటిది అని తులసి (Tulasi) చెప్పుకుంటూ బాధపడుతుంది. అంతేకాకుండా తులసి నూరేళ్ల నా జీవితాన్ని బుగ్గిపాలు చేశారు అని నందు (Nandhu) తో అంటుంది.
ఇక నన్ను వదిలించుకొని ఇంకొక ఆడదాని మెడలో తాళి కట్టారు అని ఏడుస్తుంది. అదే క్రమంలో తులసి (Tulasi) కుటుంబ సభ్యులందరి ముందు తండ్రిగా నందు పెద్ద ఫెయిల్యూర్ అని నిరూపిస్తుంది. ఇక నందు (Nandhu) మగతోడు లేకుంటే ఆడదాని కి ఇచ్చే విలువ ఏంటో నేను ఇంటి నుంచి గడప దాటాక తెలుస్తుంది అని విరుచుకు పడతాడు.
మరోవైపు రాములమ్మ (Ramulamma) ప్రేమ్, శృతి ల దగ్గరకు వచ్చి లాస్య నందు లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు అని చెబుతుంది. అంతే కాకుండా లాస్య (Lasya) ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఇల్లు ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉందని చెబుతుంది.
మరోవైపు తులసి (Tulasi) కాళ్ళు తిరిగి తిరిగి బొబ్బలు కడతాయి. ఇక తులసి బాధను తట్టుకోలేక అనసుయ కాళ్లకు ప్రేమగా బర్నాలు రాస్తుంది. ఆ క్రమంలో అత్తా కోడలు ప్రేమ ఎంతో చెప్పుకోదగినది గా ఉంటుంది. ఒకవైపు నందు, లాస్యలు కొత్త ఇంట్లోకి వెళతారు. ఇక లాస్య (Lasya) జైలు నుంచి బయటకు వచ్చినంత ఆనందంగా ఉంది అని అంటుంది.
ఇక తరువాయి భాగంలో తులసి (Tulasi) వాళ్ళ తోటి కోడలు ఒక ఆవిడతో కలిసి వస్తుంది. ఆమె నీకు 20 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. కానీ ఈ ఇల్లు నాది అవుతుంది అని అంటుంది. ఈ లోపు తులసి వాళ్ళ తోటి కోడలు ఈ ఇంటి మీద నీకు ఎంత హక్కుందో.. నాకు అంతే హక్కు ఉంది అని అంటుంది.