MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం

Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం

హైదరాబాద్‌తో సంబంధం లేకుండా గోదావరిఖని ప్రాంతంలోని ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లతో స్థానికంగానే రూపొందించిన మూవీ `కొత్త సినిమా`. ఇదొక ప్రయోగాత్మక సినిమాగా రాబోతుంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 25 2026, 08:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
లోకల్‌ టాలెంట్‌తో కొత్త సినిమా
Image Credit : Asianet News

లోకల్‌ టాలెంట్‌తో కొత్త సినిమా

సినిమా చేయాలంటే హైదరాబాద్‌కి రావాల్సిందే. ఇక్కడ ఒక ఆఫీస్‌ ఓపెన్‌ చేయాలి. ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లని ఎంపిక చేయాలి. నిర్మాతలను చూసుకోవాలి. ముందస్తుగానే పెద్ద హడావుడి చేయాల్సి ఉంటుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. దాన్ని బ్రేక్‌ చేశాడు కొత్త దర్శకుడు అజర్‌. ఆయన గోదావరిఖనికి చెందిన లోకల్‌ టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తూ, హైదరాబాద్‌తో పనిలేకుండా సినిమా చేశాడు. స్థానికంగా ఉన్న, సినిమాపై ఆసక్తి ఉన్న వారిని ఒక్కదగ్గరకు చేర్చి, వారికి ట్రైనింగ్‌ ఇచ్చి సినిమా రూపొందించాడు. ఆ మూవీనే `కొత్త సినిమా`. ఇందులో విశేషమేంటంటే.. సినిమాలో అందరు మగావారే ఉంటారు, అమ్మాయిలు కనిపించరట. ఇదొక ప్రయోగమని చెప్పొచ్చు. దీనికి అజర్‌ కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్ అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తూ, ఎడిటింగ్‌ బాధ్యతలు కూడా చూసుకున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

ఈ చిత్రానికి సంబంధించి ఆ మధ్య ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. దీనికి చరణ్‌ అర్జున్‌ సంగీతం అందించడం విశేషం. రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో గెస్ట్ గా వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, అజర్ ఈ సినిమా టైటిల్ కొత్త సినిమా అని పెట్టడమే కాదు కొత్త ప్రయత్నం కూడా చేశాడు. అందరూ మేల్ ఆర్టిస్టులతో చేసిన మొదటి సినిమా ఇదే కావొచ్చు. ఇక్కడ సినిమా మేకింగ్ అంటే ఖర్చు, ఆర్టిస్టులు కూడా ఈజీగా దొరకరు. అందుకే అజర్ తన ఊరికి వెళ్లి, అక్కడే టాలెంట్ ఉన్న వారిని చూసుకుని, వారికి ట్రైనింగ్ ఇచ్చి, అక్కడే సినిమా రూపొందించాడు. కచ్చితంగా ఒక అద్భుతమైన సినిమా చేసి ఉంటాడని నమ్ముతున్నాను. ఆయనకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా` అని అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
తెలుగు సినిమాలోనే ప్రయోగం కొత్త సినిమా
Image Credit : Asianet News

తెలుగు సినిమాలోనే ప్రయోగం కొత్త సినిమా

దర్శక నిర్మాత ఎన్ శంకర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. అజర్ తనలో ఉన్న ప్రతిభను ప్రూవ్ చేసుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందించాడు. వందమీటర్ల లోతుకు వెళ్లి పనిచేసే బొగ్గు బావి ప్రాంతం సింగరేణి నుంచి వచ్చిన టెక్నీషియన్స్ అతను. ఈ చిత్రంతో ఒక సహజమైన సినిమా, ఒక మంచి సినిమా చేసి ఉంటాడని భావిస్తున్నా. అజర్ ఈ చిత్రంతో ఎంతోమంది కొత్త వారికి అవకాశం కల్పించడం అభినందనీయం. కొత్త సినిమా నిజంగానే కొత్తగా ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని కోరుకుంటున్నా` అని చెప్పారు.

చిత్ర దర్శకుడు అజర్ మాట్లాడుతూ, సినిమా అనేది ప్రపంచంలో బలమైన మాధ్యమం. ఇలాంటి ప్రభావవంతమైన సినిమాను నేను కూడా రూపొందించాలనే ప్రయత్నం ఈ చిత్రంతో మొదలుపెట్టాను. రోజూ ఏదో ఒక పని పూర్తి చేశాననే సంతృప్తితోనే ఉండేవాడిని. నా కథతో వేరే ప్రొడ్యూసర్స్ దగ్గరకు వెళ్లకుండా నేనే ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాను. నేను కొత్త, నాతో పాటు కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తామంటే ఎవరూ నమ్మలేదు. కానీ మా ఊరిలోనే ఆడిషన్స్ చేసి టాలెంట్ ఉన్నవారిని తీసుకున్నాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. అలా ఈ సినిమా మేకింగ్ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు దాటుకుంటూ ఇక్కడిదాకా వచ్చాం. త్వరలోనే మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతున్నాం` అని తెలిపారు.

Related Articles

Related image1
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Related image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image3
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Related Stories
Recommended image1
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved