- Home
- Entertainment
- Mehreen: లంగా ఓణీ కట్టి నేనూ తెలుగమ్మాయినే అంటున్న హాట్ బ్యూటీ.. పంచె వన్నెల చిలుకలా మెహ్రీన్
Mehreen: లంగా ఓణీ కట్టి నేనూ తెలుగమ్మాయినే అంటున్న హాట్ బ్యూటీ.. పంచె వన్నెల చిలుకలా మెహ్రీన్
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి.

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. మెహ్రీన్ చివరిగా ఎఫ్3లో నటించింది. గత ఏడాది మెహ్రీన్ యువ హీరో సంతోష్ శోభన్ సరసన 'మంచి రోజులొచ్చాయి' అనే చిత్రంలో నటించింది.
మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2, ఎఫ్3 లో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది.
ఇటీవల విడుదలైన ఎఫ్3 మూవీ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీనితో ఎఫ్3 చిత్రానికి బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిలింది.
ఇదిలా ఉండగా మెహ్రీన్ ఆఫ్ స్క్రీన్ లో కూడా స్కిన్ షో చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. తాజాగా మెహ్రీన్ బ్యూటిఫుల్ హాఫ్ శారీ పిక్స్ షేర్ చేసింది.
లంగా ఓణీలో మెహ్రీన్ పంచె వన్నెల చిలుకలా మెరిసిపోతోంది. పింక్, గ్రీన్ కాంబినేషన్ లో మెహ్రీన్ లంగా ఓణీ ధరించింది. కలర్ ఫుల్ హాఫ్ శారీలో మెహ్రీన్ చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంటోంది.
ఈ ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. నార్త్ బ్యూటీ అయిన మెహ్రీన్ ఈ ఫోటోలకు తెలుగు అమ్మాయి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మెహ్రీన్ తనని తాను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో భాగమే అని అంటున్నారు.