- Home
- Entertainment
- నిహారికతో పాటు ఇతర హీరోయిన్లపై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్.. ఇక్కడే పుట్టి పెరిగారు, ఎందుకిలా..
నిహారికతో పాటు ఇతర హీరోయిన్లపై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్.. ఇక్కడే పుట్టి పెరిగారు, ఎందుకిలా..
మోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మీ ఇండస్ట్రీలోకి వచ్చింది. మల్టిట్యాలెంటెడ్ నటిగా గుర్తింపు పొందింది.ఆ ఐతే నటిగా ఆమె కెరీర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళలేదు.

మోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మీ ఇండస్ట్రీలోకి వచ్చింది. మల్టిట్యాలెంటెడ్ నటిగా గుర్తింపు పొందింది.ఆ ఐతే నటిగా ఆమె కెరీర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళలేదు. కొన్ని చిత్రాల్లో విలన్ పాత్రలు కూడా చేసింది. యాంకర్ గా కూడా రాణించింది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మంచు లక్ష్మీ తరచుగా ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే అనేక విషయాలు పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా మంచు లక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ టాలీవుడ్ హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో ఎక్కువగా నార్త్ లేదా ఇతర భాషల హీరోయిన్లదే హవా. కానీ ఇక్కడే పుట్టి పెరిగిన తెలుగు హీరోయిన్లు మాత్రం రాణించలేకున్నారు. వారికి అవకాశాలు రావడం లేదు అని మంచు లక్ష్మీ కామెంట్స్ చేసింది.
నేను టాలీవుడ్ కి రాకముందు హాలీవుడ్ లో సినిమాలు చేశాను. ఇంకో పదేళ్లు అక్కడే ఉండి ఉంటే నటిగా ఎక్కడో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అనవసరంగా టాలీవుడ్ కి వచ్చాను అనిపిస్తోంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దేవుడు మరోసారి అవకాశం ఇస్తే హాలీవుడ్ కి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. తెలుగులో పరిస్థితి విచిత్రంగా ఉంది. ఇక్కడి ఆడియన్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లనే ఎక్కువ ఇష్టపడుతున్నారు,
Niharika Konidela
ఇక్కడే పుట్టి పెరిగిన తెలుగు హీరోయిన్లని అభిమానించడం లేదు. నిహారిక ఇక్కడే పుట్టి పెరిగింది. కానీ టాప్ హీరోయిన్లతో పాటు ఆమెకి అవకాశాలు రావడం లేదు. బిందు మాధవి ఎందుకు సినిమాలు చేయలేకపోయింది ? శివాత్మిక, శివాని లాంటి తెలుగు హీరోయిన్లు ఎందుకు రాణించలేకున్నారు. వారంతా ఇక్కడ పుట్టిన వారే కదా. ప్రేక్షకులు తెలుగు హీరోయిన్లపై ఒక శాతం ప్రేమ కురిపించినా వాళ్ళ రేంజ్ ఎక్కడో ఉంటుంది.
కానీ ఆడియన్స్ తో పాటు, టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి కూడా ఇతర రాష్ట్రాల హీరోయిన్లపైనే మక్కువ ఎక్కువ అని కామెంట్స్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో మరోసారి ప్రాంతీయ భావం పై చర్చ జరుగుతోంది.
సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. తెలుగులో అద్భుతమైన నటీనటులు ఉన్నప్పుడు ఇతర భాషల నుంచి నటుల్ని ఎందుకు తీసుకువస్తున్నారు అంటూ కోట పలు సందర్భాల్లో ప్రశ్నించారు. ఇప్పుడు మంచు లక్ష్మి అదే తరహా వ్యాఖ్యలతో మరోసారి చర్చకు తెరతీసింది.