- Home
- Entertainment
- నాన్న మనసు మార్చమని దేవుణ్ణి మొక్కుకున్నా మౌనికను టార్చర్ చేస్తున్నా... మనోజ్ పెళ్లి పై మంచు లక్ష్మి కామెంట్స్
నాన్న మనసు మార్చమని దేవుణ్ణి మొక్కుకున్నా మౌనికను టార్చర్ చేస్తున్నా... మనోజ్ పెళ్లి పై మంచు లక్ష్మి కామెంట్స్
తమ్ముడు మనోజ్ పెళ్లి దగ్గరుండి చేసింది మంచు లక్ష్మి. తొలిసారి ఈ వివాహం పై ఆమె ఓపెన్ కామెంట్స్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి.

గత ఏడాది హీరో మనోజ్, భూమా మౌనిక జంటగా కనిపించి సంచలనం రేపారు. ఈ క్రమంలో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇద్దరూ ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి. అలాగే మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకోవడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. ముఖ్యంగా మోహన్ బాబు, విష్ణు వ్యతిరేకిస్తున్నారంటూ ప్రచారం జరిగింది.
నిజానికి ఇవ్వన్నీ వాస్తవాలే అని మెల్లగా తెలిసొచ్చింది. మోహన్ బాబుకు ఇష్టం లేకుండానే మనోజ్ వివాహం జరిగింది. మనోజ్ వివాహ బాధ్యత మంచు లక్ష్మి తీసుకుంది. మార్చి 3వ తేదీన హైదరాబాద్ లో తన నివాసంలో మౌనిక-మనోజ్ ల వివాహం నిర్వహించింది. చివరి నిమిషంలో మోహన్ బాబు హాజరయ్యారు. విష్ణు మాత్రం దూరంగా ఉన్నాడు.
మనోజ్ పెళ్లిపై తాజాగా మంచు లక్ష్మి స్పందించారు. ఆమె మాట్లాడుతూ... మనోజ్-మౌనికల వివాహం జరగాలని యాదాద్రిలో మొక్కుకున్నాను. మా నాన్న(మోహన్ బాబు) మనసు మార్చమని వేడుకున్నాను. ఆ దేవుడు ఆలకించాడు. మనోజ్ పెళ్లి జరిగింది. మా రెండు కుటుంబాలకు చరిత్ర ఉంది. మనోజ్, మౌనిక నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అనే సందేహాలు కుటుంబ సభ్యుల్లో ఉన్నాయి.
ప్రేమకు ఏదీ అతీతం కాదు. వాళ్ళు ప్రేమించుకుంటే మనం ఏం చేయగలం. మనోజ్ నాకు ఏ కష్టం వచ్చినా ముందు ఉండేవాడు. మనోజ్ పెళ్లి నా నివాసంలో చేశాను. పెళ్లికి ముందు ఇద్దరూ నా దగ్గరే ఉన్నారు. పెళ్ళయాక వేరే ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. మౌనిక ఫోన్ చేసి అదెలా చేయాలి? ఇదెలా చేయాలి? అని అడుగుతుంది. నేను చెప్పకుండా టార్చర్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్నప్పుడు అడిగావా? అంటూ ప్రశ్నిస్తున్నాను.
Manchu Manoj
నాకు పిల్లలంటే ఇష్టం. ముగ్గురు నలుగురు పిల్లల్ని కనాలి అనుకున్నాను. దేవుడు ఒక అమ్మాయినే ఇచ్చాడు అన్నారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ, నాకు ఆ ఆసక్తి లేదని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. తనకు చేతనైనంతలో ఎన్జీవోల ద్వారా సామాజిక సేవ చేస్తుంది.