- Home
- Entertainment
- Liger Heroin Ananya Pandey:లైగర్ భామ అనన్య అరాచకం... బికినీలో తడిసి అందాలు ప్రదర్శన
Liger Heroin Ananya Pandey:లైగర్ భామ అనన్య అరాచకం... బికినీలో తడిసి అందాలు ప్రదర్శన
పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది బాంబే భామ అనన్య పాండే(Aananya Pandey). బికినీలో అమ్మడు బోల్డ్ ఫోటో షూట్ ఇంటర్నెట్ లో సెగలు రేపుతున్నాయి. పొడుగుకాళ్ల సుందరి స్కిన్ షో నెక్స్ట్ లెవల్ కి చేరగా నెటిజెన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది.

స్టార్ కిడ్ అనన్య పాండే లేటెస్ట్ రిలీజ్ గెహరియాన్ (Gehraiyaan)టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇంటెన్స్, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన గెహరియాన్ మూవీలో దీపికా పదుకొనె (Deepika Padukone) మెయిన్ లీడ్ చేశారు. అనన్య పాండే మరో కీలక రోల్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం కొంచెం హద్దులు మీరు రొమాన్స్ కురిపించారు దీపికా, అనన్య పాండే.
ఇక లైగర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. డైనమిక్ డైరెక్టర్ పూరి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. ఇక హీరోలతో పాటు హీరోయిన్స్ ని సరికొత్తగా ప్రజెంట్ చేయడంలో పూరి సిద్ధహస్తుడు. మరి ఈ యంగ్ బ్యూటీ అనన్య పాండేను ఎలా చూపిస్తారో చూడాలి.
బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురైన అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు పునీత్ మల్హోత్ర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు.
అనంతరం, పతి పత్ని ఔర్ ఓహ్, కాలీ పీలీ చిత్రాలు చేశారు. ఇప్పుడిప్పుడే అనన్య బాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. లైగర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఈ నేపథ్యంలో లైగర్ (Liger) విజయం సాధిస్తే అనన్యకు బ్రేక్ దక్కినట్లే.
కెరీర్ ఇలా ఉంటే... సోషల్ మీడియాలో మాత్రం అనన్య అసలు తగ్గడం లేదు. ఆమె హాట్ ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. పొట్టి బట్టల్లో లేలేత నాజూకు అందాల ప్రదర్శిస్తూ దర్శక నిర్మాతల టార్గెట్ గా మారుతుంది. గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే ఆ మాత్రం తెగింపు ఉండాలి మరి.
తాజాగా స్విమ్మింగ్ బికినీ ధరించి స్విమ్మింగ్ ఫూల్ లో ఫోటో షూట్ చేసింది. తడిసిన అందాలతో చలిలో ఫ్యాన్స్ కి చెమటలు పట్టించింది. ఇంస్టాగ్రామ్ లో అనన్యను రెండు కోట్లకు పైగా ఫాలో అవుతున్నారు. సదరు ఫాలోవర్స్ నిరాశపడకుండా అందాలతో విందుతో వారి ఆకలి తీరుస్తున్నారు.