హాట్ నెస్ పెంచేస్తున్న లావణ్య పెదవులు.. చూపులతో కసిగా గుచ్చేస్తూ ఫోజులు, వైరల్
అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.

అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అందాల రాక్షసి తర్వాత లావణ్యకి నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాల కంటే గ్లామర్ రోల్స్ ఎక్కువగా వచ్చాయి.
మంచి విజయాలు కూడా దక్కించుకుంది. అయితే కొన్నేళ్లుగా లావణ్యకి సరైన సక్సెస్ లేదు. దీనితో వెండితెరపై ప్రయత్నాలు చేస్తూనే ఓటిటిలో కూడా అదృష్టం పరీక్షించుకుంటోంది. అయితే రెండు రోజుల క్రితమే లావణ్య త్రిపాఠి నటించిన వెబ్ సిరీస్ 'పులి మేక' జీ 5లో విడుదలయింది. ఈ సిరీస్ లో ఆది సాయికుమార్ కూడా నటించారు. పులి మేక సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా లావణ్య త్రిపాఠి లేడీ పోలీస్ అధికారి పాత్రలో అదరగొట్టేసిందట. ఓ సీరియల్ కిల్లర్ పోలీస్ అధికారులని హత్య చేస్తుంటాడు. ఈ కేసుని చేధించే బాధ్యత తీసుకున్న లేడి పోలీస్ పాత్రలో లావణ్య నటించింది.
ఆమెకి సహాయం చేసే ఫోరెన్సిక్ నిపుణుడిగా ఆది సాయి కుమార్ నటించారు. కథ లావణ్య కేంద్రంగానే సాగుతుంది. కథ మొత్తాన్ని లావణ్య తన నటన, యాక్షన్, ఎమోషన్ తో నడిపించింది. ఇటీవల కాలంలో లావణ్య త్రిపాఠికి దక్కిన బెస్ట్ రోల్ అని ప్రశంసిస్తున్నారు.
అందంతో ఎప్పుడూ కవ్వించే లావణ్య త్రిపాఠి అతిగా మాత్రం స్కిన్ షో చేయలేదు. యువత కోరుకునే విధంగా స్టన్నింగ్ లుక్ తో మెప్పించడం ఆమె స్టైల్. తాజాగా లావణ్య త్రిపాఠి బ్లూ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తోంది.
ఊరించే పెదవులు, గుచ్చేసేలా ఉన్న చూపులతో లావణ్య ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. అలాగే చీర కట్టులో కూడా లావణ్య తన గ్లామర్ ప్రదర్శించింది.