MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కీర్తిసురేష్‌కి షాకిచ్చిన అనుపమా పరమేశ్వరన్‌.. సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేస్తూ సంచలనం..

కీర్తిసురేష్‌కి షాకిచ్చిన అనుపమా పరమేశ్వరన్‌.. సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేస్తూ సంచలనం..

మలయాళ ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌ కి చాలా కాలంగా హిట్‌ లేదు. దీంతో `మహానటి`గా పేరుతెచ్చుకున్నా స్ట్రగుల్స్ తప్పడం లేదు. కానీ క్యూట్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ మాత్రం ఆ సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేయడం విశేషం. 

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 30 2022, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

టాలీవుడ్‌(Tollywood)లో మలయాళ ముద్దుగుమ్మల(Malayalam Heroines) హవా మామూలు కాదు. అద్బుతమైన నటనతో మెస్మరైజ్‌ చేశారు. సునామీలా దూసుకొచ్చి అంతే వేగంగా కనుమరుగు అవుతుంటారు. ఒకరు ఇద్దరు తప్పితే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుని, టాలీవుడ్‌లో సెటిల్‌ అయిన వాళ్లు చాలా తక్కువ. ఇప్పటి తరం కథానాయికలు సైతం ఆదిలో మెరుస్తూ, అంతలోనే డౌన్‌ఫాల్‌ అవుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

నిత్యా మీనన్‌(Nithya Menon), అను ఇమ్మాన్యుయెల్‌(Anu Emmanuel), నివేదా థామస్‌(Nivetha Thomas), కీర్తిసురేష్‌(Keerthy Suresh), అనుపమా పరమేశ్వరన్‌ వంటి మలయాళ ముద్దుగుమ్మల కెరీర్‌ చాలా కాలంగా స్ట్రగులింగ్‌లోనే సాగుతుంది. ఎంట్రీ ఇచ్చిన ఒకటి రెండు సినిమాల వరకు ఫర్వాలేదు. తర్వాత వరుసగా పరాజయాలు పడటంతో సైలెంట్‌ అయిపోతున్నారు. ఇటీవల కాలంలో కీర్తిసురేష్‌ స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు ఆమె వరుస పరాజయాల్లో ఉంది. 

311

`మహానటి`తో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది కీర్తిసురేష్‌. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌ సక్సెస్‌ అందుకున్న మలయాళ భామ లేదంటే అతిశయోక్తి లేదు. దీంతో వరుసగా కమర్షియల్‌ చిత్రాలతోపాటు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసింది. కానీ `మహానటి` తర్వాత కీర్తికి తెలుగులో ఒక్క సక్సెస్‌ కూడా దక్కలేదు. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ కూడా సక్సెస్‌ ఆమడ దూరంలో ఉండిపోయింది. 

411

నిత్యా మీనన్‌ మొదట్లో బాగానే మెరిసినా, ఆమె కూడా స్టార్‌ హీరోల సరసన కమర్షియల్‌ చిత్రాలు చేసింది తక్కువ. సెకండ్‌ హీరోయిన్‌గా పరిమితమయ్యే పరిస్థితి. అను ఇమ్మాన్యుయెల్‌ `మజ్ను` సక్సెస్‌ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్‌ తగల్లేదు. కేథరిన్‌ థ్రెస్సా సైతం స్టార్‌ ఇమేజ్‌కి నోచుకోలేకపోయింది. పూర్ణ బోల్డ్ బ్యూటీగా మారిపోయింది. అమలా పాల్‌ ఒకటి అర సినిమాల్లో మెరిసి టాలీవుడ్‌కి దూరమైంది. భావన, ఆసిన్‌, ప్రియమణి వంటి కథానాయికలు సైతం సేమ్‌. వాళ్లు తెలుగులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. 

511
Anupama Parameswaran

Anupama Parameswaran

కానీ ఆ సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేస్తుంది అనుపమా పరమేశ్వర్‌(Anupama Parameswaran). మొన్నటి వరకు అనుపమా పరమేశ్వరన్‌ కెరీర్‌ కూడా తెలుగులో అయిపోయిందనుకున్నారు. చాలా వార్తలు వినిపించాయి. సోషల్‌ మీడియాలో అనేక పోస్టులు కూడా వచ్చాయి. కానీ దాన్ని ఒక్క సినిమా బ్రేక్‌ చేసింది. `కార్తికేయ 2` అనుపమాకి ఊహించిన బూస్ట్ ఇచ్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకురావడం విశేషం. 

611
Anupama Parameswaran

Anupama Parameswaran

దీంతో ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతుంది అనుపమా. ఆమె ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అదే సమయంలో కెరీర్‌ పరంగా పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఓ రకంగా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. మరో రెండుమూడేళ్ల వరకు అనుపమాకి తిరుగులేదని చెప్పొచ్చు. 
 

711

`ప్రేమమ్‌` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌. ముగ్గురు హీరోయిన్లలో టీనేజ్‌ బ్యూటీ అదరగొట్టింది. దీంతో తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. ఆ తర్వాత `శతమానం భవతి` చిత్రంతో మరో సక్సెస్‌ని అందుకుంది. శర్వానంద్‌తో కలిసి నటించింది. ఈ చిత్రం తెలుగు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుని అందుకోవడం విశేషం.

811

దీని తర్వాత వరుస పరాజయాలు ఆమెని వెంటాడాయి. `ఉన్నది ఒక్కటే జిందగీ`, `కృష్ణార్జున యుద్ధం`, `తేజ్‌ః ఐ లవ్‌ యూ`, `హలో గురు ప్రేమ కోసమే` చిత్రాల్లో నటించగా, అవన్నీ పరాజయం చెందాయి. దీంతో అనుపమా పరిస్థితి కూడా అయిపోయిందనే వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఇతర మలయాళ భామలు మాదిరిగానే అనుపమా మిగిలిపోతుందన్నారు. 

911

కానీ `రాక్షసుడు` చిత్రం కాస్త హోప్‌ ఇచ్చింది. కానీ అవకాశాలు లేవు. ఆ సమయంలోనే `18పేజెస్‌`, `కార్తికేయ 2` వంటి ఆఫర్లు బ్యాక్‌ టూ బ్యాక్‌ వచ్చాయి. అలాగే `రౌడీ బాయ్స్` వంటి యూత్‌ఫుల్‌ మూవీలోనూ మెరిసింది. ఇందులో బోల్డ్ రోల్‌ చేసి షాకిచ్చింది. తాను మారాననే సిగ్నల్స్ ఇచ్చింది. ఇప్పుడు `కార్తికేయ2`తో సంచలన విజయం దక్కించుకుని మళ్లీ ప్రామిసింగ్‌ హీరోయిన్‌ అయిపోయింది. 

1011

ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్‌ చేతిలో `18 పేజెస్‌`తోపాటు `బట్టర్‌ ఫ్లై` అలాగే రెజీనాతో చేస్తున్న బైలింగ్వల్ మూవీ ఉంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తుంది. నెమ్మదిగా బిజీ అవుతుంది అనుపమా. అయితే ట్రెండ్‌కి తగ్గట్టుగా అనుపమా కూడా మారిపోతుంది. మలయాళ హీరోయిన్లంటే గ్లామర్‌ షోకి దూరమనే ట్యాగ్‌ పడిపోయింది. కానీ అనుపమా దాన్ని బ్రేక్ చేసింది. అందాల ఆరబోతకి కూడా తాను సిద్దమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. 
 

1111

అందుకు తగ్గట్టుగా వరుసగా హాట్‌ ఫోటోలను పంచుకుంటుంది. గ్లామర్‌ విందు చేస్తూ నెటిజన్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. బోల్డ్ సీన్లలోనూ నటిస్తూ కమర్షియల్‌ హీరోయిన్‌ ఫ్లేవర్‌ని తీసుకొస్తుంది. మలయాళ భామల సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేస్తూ కెరీర్‌ ని పరుగులు పెట్టిస్తుంది. నయా ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తుంది. మరి ఈ భామ సందడి మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Recommended image2
Folk Song: ప్యారడైజ్‌ మూవీలో దుమ్ములేపుతున్న తెలంగాణ ఫోక్‌ సాంగ్‌.. రేపు థియేటర్లు ఊగిపోవాల్సిందే
Recommended image3
Irumudi OTT Date: రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved