MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun: పుష్ప పార్ట్ 2లో కట్టప్ప ? నమ్మశక్యంగా లేదు కానీ.. ఒళ్ళు గగుర్పొడిచేలా..

Allu Arjun: పుష్ప పార్ట్ 2లో కట్టప్ప ? నమ్మశక్యంగా లేదు కానీ.. ఒళ్ళు గగుర్పొడిచేలా..

పుష్ప మొదటి భాగంలో కొన్ని చోట్ల అభిమానులు సంతృప్తి చెందలేదు. కొన్ని లోపాలు కనిపించాయి అని క్రిటిక్స్ కూడా పెదవి విరిచారు. దీనితో పుష్ప పార్ట్ 2ని సుకుమార్ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Feb 17 2022, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఇండియాలో బన్నీ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడిగా మారిపోయాడు. సెలెబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు సైతం చిత్రంలోని పాటలకు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప మొదటి భాగం మంచి విజయం సాధించింది. సెకండ్ పార్ట్ కి కావలసిన పబ్లిసిటీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అనే చెప్పాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పుష్ప మొదటి భాగంలో కొన్ని చోట్ల అభిమానులు సంతృప్తి చెందలేదు. కొన్ని లోపాలు కనిపించాయి అని క్రిటిక్స్ కూడా పెదవి విరిచారు. దీనితో పుష్ప పార్ట్ 2ని సుకుమార్ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. పుష్ప మొదటి భాగంలో సుక్కు ఎక్కువగా పాత్రల పరిచయం, సినిమా థీమ్ ని వివరించడానికే సమయం తీసుకున్నారు. అసలు సిసలైన కథ పార్ట్ 2 కోసమే దాచారట. 

37

పార్ట్ 1 ముగిసిన విధానం చూస్తే అది నిజమే అనిపించక మానదు. ఎందుకంటే అల్లు అర్జున్ దొరికితే రాబందుల్లా పొడుచుకు తినేందుకు షెకావత్, దాక్షాయణి, కొండారెడ్డి రెండో తమ్ముడు ఎదురుచూస్తున్నారు. వీరందరిని అల్లు అర్జున్ పార్ట్ 2లో ఎలా ఎదుర్కొంటాడు అనేది అత్యంత ఉత్కంఠగా మారింది. 

47

పార్ట్ 1లోనే బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ కి డాన్ గా మారిపోయాడు. సో అతడికి సొంత సైన్యం తయారైంది. అలాంటి పుష్ప ఎదిరించడం అంత సులువు కాదు. షెకావత్, దాక్షాయణి, కొండారెడ్డి రెండో తమ్ముడి పగ సులభంగా తీరేది కాదు. ఈ నేపథ్యంలో ఓ ఇంటరెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్పపై పగ సాధించడానికి వారికి ఉన్న ఒకే ఒక్క మార్గం వెన్నుపోటు అని అంటున్నారు. 

57

ఇక్కడే కట్టప్ప తరహా ట్విస్ట్ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్ట్ 1లో పుష్పకి అంత్యంత సన్నిహితుడిగా కనిపించిన మొండేలు కేశవ కట్టప్ప అవతారం ఎత్తబోతున్నాడు అనే ఊహించని గాసిప్ వైరల్ గా మారింది. నమ్మశక్యంగా లేకున్నా అదే నిజం అని అంటున్నారు. దాక్షాయణి, కొండారెడ్డి తమ్ముడితో కలసి షెకావత్ పథకం రచిస్తాడట. దీని ప్రకారం మొండేలుని తమ గుప్పెట్లోకి తీసుకుని అల్లు అర్జున్ కి వెన్నుపోటు పొడిచేలా చేస్తారు అని అంటున్నారు. 

67

అల్లు అర్జున్ ని వారు పెట్టే ఇబ్బందులు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి అని.. ఆ సమస్యల సుడిగుండంలో నుంచి పుష్ప రాజ్ ఎలా బయట పడ్డాడు అనేది పార్ట్ 2 కథ అని అంటున్నారు. పుష్పకి వెన్నుపోటు పొడిచే ఎపిసోడ్ లో అనసూయ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. 

77

ఇదే కనుక నిజమైతే సుక్కు చేతిలో సాలిడ్ స్క్రిప్ట్ చేతిలో ఉన్నట్లే. మార్చి నుంచి పుష్ప ది రూల్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Recommended image2
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image3
CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved