- Home
- Entertainment
- Janaki Kalaganaledu: కొడుకుకోడల్ని ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్న జ్ఞానంబ.. బావమరిదిని చితక్కొట్టిన రామచంద్ర!
Janaki Kalaganaledu: కొడుకుకోడల్ని ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్న జ్ఞానంబ.. బావమరిదిని చితక్కొట్టిన రామచంద్ర!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పరువుగల కుటుంబ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. రేటింగ్ లో కూడా బాగానే దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

జానకి, రామచంద్ర (Ramachandra) ఇంట్లో లేకపోయేసరికి జ్ఞానంబ ఆ గుడిసె లోకి వెళ్లి అక్కడున్న వాతావరణంను చూస్తుంది. పైగా తన ఫోటోని చూస్తూ ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. నీ కష్టాలను నేను చూడలేకపోతున్నాను అని.. ఇక్కడే ఉంటే జానకి (Janaki) నిన్ను ఏం చేస్తుందో అన్న భయం వెంటాడుతుంది అనుకుంటూ.. అందుకే ఒక మెట్టు దిగి వచ్చానని అనుకుంటుంది.
నీ భార్య ని వదిలేసి నువ్వు ఉండలేవు కాబట్టి అందుకే నీ కోసం తనను భరించడానికి సిద్ధపడ్డాను అంటూ.. నిన్ను జానకిని (Janaki) ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను అని అనుకుంటుంది. ఇక ఆ సమయంలో మల్లిక (Mallika) అత్తయ్య గారు అని గట్టిగా పిలుస్తూ.. మన ఇంటికి పోలీసులు వచ్చారు అని అంటుంది.
దాంతో వెంటనే ఏమైంది ఎందుకు వచ్చారు అని పోలీసులను ప్రశ్నిస్తుంది జ్ఞానంబ (Jnanamba). మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని ఎస్ఐ చెప్పటంతో జ్ఞానంబ షాక్ అవుతుంది. మీరు మీ పెద్ద కోడలు జానకిని (Janaki) వేధిస్తున్నారని.. గృహహింస చట్టం కింద కంప్లైంట్ వచ్చింది అని అందుకే అరెస్టు చేస్తున్నామని అంటాడు.
వెంటనే గోవిందరాజులు (Govindharajulu).. జానకిని మేము హింసించడం ఏంటి అని.. ఇంతకీ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అని అడగటంతో.. జానకి వాళ్ళ అన్నయ్య యోగి కంప్లైంట్ ఇచ్చాడు అని అంటాడు. అతను పొరపాటు పడ్డాడు.. మా కోడల్ని మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని అంటాడు. కావాలంటే జానకి (Janaki) తోనే విషయం చెప్పిస్తామని అంటాడు.
ఇక విష్ణుతో (Vishnu)..వెళ్లి జానకిని వాళ్లను పిలవమని అనడంతో.. వెంటనే మల్లిక అడ్డు వచ్చి.. వాళ్ళ అన్నయ్యతో కేసు పెట్టించడానికి బయటికి వెళ్ళింది. ఆమె ఇంట్లో లేదు. కరెక్ట్ గా జానకి (Janaki) తన అన్నయ్య వచ్చేసరికి ఆమె ఇంట్లో ఎందుకు లేదు. ఇదంతా జానకి ప్లాన్ అంటూ జానకి గురించి నిందలు వేస్తూ ఉంటుంది.
వెంటనే ఎస్ఐ వారి మాటలను ఆపి జ్ఞానంబను (Jnanamba) పోలీస్ స్టేషన్ కు రమ్మని అంటాడు. ఇక గోవిందరాజులు మా పరువు పోతుంది.. దయచేసి అరెస్టు చేయకండి అని అంటాడు. ఇక జ్ఞానంబ.. మాట్లాడుతూ.. తన అన్నయ్య తో నాపై కేసు పెట్టినప్పుడే ఇంటి పరువు పోయిందని జానకిపై (Janaki) విరుచుకుపడుతుంది.
మరోవైపు గుడిలో జానకి (Janaki), రామ కూర్చుని సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా అంతలోనే దొరబాబు అక్కడికి వచ్చి జ్ఞానంబ రామపై చూపించిన ప్రేమను చెబుతాడు. వెంటనే రామ బాగా ఎమోషనల్ అవుతాడు. ఇక రామ (Rama) సైకిల్ పై వెళుతుండగా జీపులో వెళ్తున్న తన తల్లిని చూసి అమ్మ అని అరుస్తాడు.
ఇక పోలీస్ స్టేషన్ ను చేరుకున్న జ్ఞానంబను (Jnanamba) యోగి (Yoghi) జానకి యొక్క గొప్పదనం గురించి చెబుతూ ఉంటాడు. తరువాయి భాగంలో నిజం తెలుసుకున్న రామచంద్ర యోగిని బాగా చితక్కొడుతాడు.