MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha Baby Bump: జిమ్‌లో బేబీ బంప్‌తో సమంత అదిరిపోయే పోజులు.. బేబీ పేరు సజెస్ట్ చేసిన అభిమానికి కౌంటర్

Samantha Baby Bump: జిమ్‌లో బేబీ బంప్‌తో సమంత అదిరిపోయే పోజులు.. బేబీ పేరు సజెస్ట్ చేసిన అభిమానికి కౌంటర్

Samantha Baby Bump: సమంత ఇటీవల `మా ఇంటి బంగారం` మూవీతో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు గర్భంతో ఉన్న ఆమె బేబీ బంప్‌ ఫోటోలతో అలరిస్తోంది. లేటెస్ట్ లుక్స్ వైరల్‌ అవుతున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 31 2026, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మా ఇంటి బంగారంతో హిట్‌ కొట్టిన సమంత
Image Credit : instagram/@samantharuthprabhuoffl

మా ఇంటి బంగారంతో హిట్‌ కొట్టిన సమంత

సమంత ఇటీవల `మా ఇంటి బంగారం` మూవీతో విజయాన్ని అందుకున్నారు. ఆమె కమ్‌ బ్యాక్‌ ఇస్తూ నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపింది. సుమారు వంద కోట్ల కలెక్షన్లు సాధించింది. మూడేళ్ల గ్యాప్‌తో వచ్చిన ఆమెకిది అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ అని చెప్పొచ్చు. దీంతో మళ్లీ వరుసగా సినిమాలు చేస్తుందని, ఆమెని తెరపై చూడొచ్చని అభిమానులు ఎంతో ఆశపడ్డారు. కానీ తన ప్రెగ్నెన్సీని ప్రకటించి వారి ఆశలపై నీళ్లు చల్లింది. కాకపోతే ఇప్పుడు నిత్యం సోషల్‌ మీడియాలో కనిపిస్తూ అలరిస్తోంది. బేబీ బంప్‌ ఫోటోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది సామ్‌.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లేటెస్ట్ బేబీ బంప్‌ ఫోటోలు
Image Credit : instagram/@samantharuthprabhuoffl

లేటెస్ట్ బేబీ బంప్‌ ఫోటోలు

అందులో భాగంగా తాజాగా ఆమె నయా బేబీ ఫోటోలను షేర్‌ చేసింది. బేబీ బంప్‌తో జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న ఫోటోలను పంచుకుంది. అలాగే ఇంట్లో సరదా టైమ్‌లో ఆమె బేబీ బంప్‌ సెల్ఫీ ఫోటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడివి వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి. ఈ సందర్భంగా చాలా మంది అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఆమెకి విషెస్‌ చెబుతున్నారు. అయితే కొందరు మరో అడుగు ముందుకేసి రాబోయే బేబీకి పేర్లు సజెస్ట్ చేస్తున్నారు.

35
సమంత బిడ్డకి పేర్లు పెట్టిన అభిమాని
Image Credit : instagram/@samantharuthprabhuoffl

సమంత బిడ్డకి పేర్లు పెట్టిన అభిమాని

సమంతకి పుట్టబోయే బిడ్డకి అదిరిపోయే పేర్లు సజెస్ట్ చేశారు ఒక అభిమాని. అమ్మాయి పుడితే `సమైరా` అని, కొడుకు పుడితే `సామ్‌రాజ్‌` పెట్టుకోవాలని తెలిపారు. ఇన్‌ స్టాగ్రామ్‌లో ఆమెకి పోస్ట్ లు పెట్టారు. దీనికి సమంత రియాక్ట్ అయ్యింది. సామ్‌రాజ్‌.. పేరు విషయంలో మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం, అది మా పని, మీరు తలబద్దలు కొట్టుకోకండి` అని చెబుతూ రిప్లై ఇచ్చింది. సమంత రియాక్షన్‌ ఇప్పుడు రచ్చ చేస్తుంది.

45
బేబీ బంప్‌ని ఎంజాయ్‌ చేస్తున్న సమంత
Image Credit : instagram/@samantharuthprabhuoffl

బేబీ బంప్‌ని ఎంజాయ్‌ చేస్తున్న సమంత

బేసిక్‌గా సమంతకి పిల్లలంటే ఇష్టం. ఆమె పలు మార్లు ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ పిల్లల కోసమే ఆమె ఇన్నాళ్లు వెయిట్‌ చేసింది. గత మ్యారేజ్‌ లైఫ్‌లో కూడా ఈ విషయంలోనే గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎట్టకేలకు సమంత ఇప్పుడు తల్లి కాబోతుంది. ప్రస్తుతం ఆమె బేబీ బంప్‌ ని ఎంజాయ్‌ చేస్తుంది. మాతృత్వానికి సంబంధించిన ముందస్తు సంతోషాన్ని పొందుతుంది. ఈ క్రమంలో ఆమె వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది.

55
హీరోయిన్‌గా తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సమంత
Image Credit : Instagram@samantharuthprabhuoffl

హీరోయిన్‌గా తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సమంత

సమంత `ఏం మాయ చేసావె` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయిన విషయం తెలిసిందే. నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంతో తొలి విజయాన్ని అందుకుంది. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది. ఆ తర్వాత వరసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ ని సొంతం చేసుకుంది. అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌గా ఎదిగింది. నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లకే వీళ్లు విడిపోయారు. ఆ తర్వాత అనారోగ్యానికి గురయ్యింది. సినిమాలకు బ్రేక్‌ తీసుకుంది. ఇంకోవైపు ఆ మధ్య తన తండ్రిని కోల్పోయింది. అనేక స్ట్రగుల్స్ తర్వాత కోలుకొని `మా ఇంటి బంగారం` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Related Stories
Recommended image1
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Recommended image2
Folk Song: ప్యారడైజ్‌ మూవీలో దుమ్ములేపుతున్న తెలంగాణ ఫోక్‌ సాంగ్‌.. రేపు థియేటర్లు ఊగిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved