ఆ విషయంలో అక్కను తొక్కేస్తున్న శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్... జాన్వీ చాలదు బాబోయ్!
బాలీవుడ్ స్టార్ కిడ్ ఖుషి కపూర్ ఆరంగేట్రాని ముందే సోషల్ మీడియాను దున్నేస్తుంది. ఒక్క సినిమా చేయక ముందే మోస్ట్ వాంటెడ్ సెలబ్రీటీగా అవతరించింది.
Kushi Kapoor
అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె అందాల ప్రదర్శనలో అక్కను మించేస్తుంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో టాప్ మోడల్ పొజిషన్ పై కన్నేసింది. అదే సమయంలో భారీగా ఫ్యాన్ బేస్ ని సంపాదిస్తుంది. గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. గ్లామరస్ ఫోటో షూట్స్ కెరీర్ కి చాలా అవసరం. జాన్వీ కపూర్ సోషల్ మీడియా హాట్ బాంబ్ గా అవతరించింది.
Kushi Kapoor
అమ్మ, అక్క అడుగుజాడల్లో నడుస్తున్న ఖుషి వెండితెర ఆరంగేట్రానికి సిద్ధం అవుతుంది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శనకు తెరలేపుతుంది. తాజాగా నెట్ డ్రెస్ లో లోదుస్తులు కన్పించేలా హాట్ ఫోటో షూట్ చేసింది. ఖుషి కపూర్ దెబ్బకు ఇంస్టాగ్రామ్ షేక్ అయ్యింది.
Kushi Kapoor
ఖుషి డెబ్యూ మూవీ ది ఆర్చీస్. దర్శకురాలు జోయా అక్తర్ తెరకెక్కిస్తోంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో ఖుషి కపూర్ నటిస్తుంది. అలాగే మరో సార్ కిడ్ సుహానా ఖాన్ కూడా భాగమయ్యారు. నెట్ఫ్లిక్స్ లో ది ఆర్చీస్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్ పై పరిశ్రమలో అంచనాలు ఉన్నాయి.
Kushi Kapoor
అలాగే తమిళ్ హిట్ మూవీ లవ్ టుడే లో ఖుషి కపూర్ నటిస్తున్నారట. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తారట. లవ్ టుడే హిందీ రీమేక్ కి సర్వం సిద్ధం అవుతుండగా ఖుషి కపూర్-జునైద్ ఖాన్ జంటగా నటిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాల సారాంశం.ఈ క్రేజీ రీమేక్ కి ఆల్రెడీ ఖుషి కపూర్ సైన్ చేశారంటున్నారు.
Kushi Kapoor
మరోవైపు ఖుషిపై ఎఫైర్ రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇండో-కెనడియన్ సింగర్ ఏపీ ధిల్లాన్ తో ఖుషి కపూర్ డేటింగ్ చేస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ ఎక్కడా జంటగా కనిపించలేదు. అయితే ధిల్లాన్ లేటెస్ట్ సాంగ్ లిరిక్స్ లో ఖుషి కపూర్ పేరు జోడించారు. ఇది పుకార్లకు ఊతం ఇచ్చింది.
బోనీ కపూర్-శ్రీదేవిలకు ఇద్దరు అమ్మాయిలు కాగా జాన్వీ ఆల్రెడీ హీరోయిన్ గా కొనసాగుతుంది. దేవర మూవీతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. జాన్వీ అటు మోడల్ గా నటిగా ప్రస్థానం మొదలుపెట్టారు. రానున్న రెండేళ్లలో ఖుషి పూర్తి స్థాయిలో సినిమాలు చేయనున్నారు. మరి ఈ ఇద్దరు వారసుల్లో శ్రీదేవి రేంజ్ కి ఎవరైనా వెళతారేమో చూడాలి...