MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మరో సూపర్ స్టార్ సినిమాలో జాన్వీ..కాన్సెప్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్

మరో సూపర్ స్టార్ సినిమాలో జాన్వీ..కాన్సెప్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్

"జీవితంతో కొన్ని సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాలి, సవాళ్లను ఎదుర్కొవాలి, అలాగే అభిమానులు, ప్రేక్షకులను మెప్పించాలంటే కథానాయికగా బలమైన కథలు ఎంచుకోవాలి. వాటితో ప్రేక్షకులను మెప్పించాలి. అందుకోసం చాలా కష్టపడాలి’’ 

4 Min read
Author : Surya Prakash
Published : May 16 2024, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలో ప్రవేశించిన జాన్వీ కపూర్ వరస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. తెలుగు,హిందీ,తమిళం ఇలా మూడు భాషల్లోనూ ఆమె కుమ్మేయటానికి రంగం సిద్దం చేసుకుంటోంది.ఇప్పుడు జాన్వి కపూర్ తో చేస్తే ప్యాన్ ఇండియా రిలీజ్ కు ఈజీ అవుతుందనే దర్శక,నిర్మాతలు నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఎక్కడెక్కడి ప్రాజెక్టులు ఆమె దగ్గరకే వస్తున్నాయి. ఆమె డైరక్టర్, హీరో, స్క్రిప్టు ఇలా మూడు ప్రయారిటీలు చూసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలో తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న జాన్వి తాజాగా మరో సూపర్ స్టార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమా గురించిన వార్తలే ఇప్పుడు అంతటా...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213


ప్రస్తుతం జాన్వీ రెండు తెలుగు చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఎన్టీఆర్‌ సరసన 'దేవర’, రామ్‌చరణ్‌, బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే  వినిపిస్తున్న సమాచారం ప్రకారం తమిళ సూర్యకు జోడీగా ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వి డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.
 

313
Janhvi Kapoor

Janhvi Kapoor


 రాకేష్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ అయితేనే పర్ఫెక్ట్ అని దర్శకుడు భావించి ఎంపిక చేసారట. సూర్య, రాకేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలకు పైగానే అని తెలుస్తోంది. ఈ సినిమాతో సూర్య హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. జాన్వి పాత్ర ..పురాణాల్లోదే అని...కర్ణుడుని ఇష్టపడి పెళ్లి చేసుకునే పాత్ర అంటున్నారు. 

413


ఈ సినిమా ‘మహాభారతం’ ఆధారంగా తెరకెక్కుతోందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇందులో సూర్య కర్ణుడిగా నటించనున్నాడట. ప్రస్తుతం సూర్య నటించిన ‘కంగువా’ సినిమా చాలా బిజీగా ఉంది. ఈ సినిమా గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ పాత్రల్లో సూర్య నటిస్తున్నారు. ఈ చిత్రంలో దిశా పటాని, బాబీ డియోల్, జగపతి బాబు తదితరులు నటించారు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. కంగువా సినిమా 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతోంది.
 

513


ఇక  జాన్వీ కపూర్, హీరో రాజ్‍కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ చిత్రం రూపొందింది. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి గుంజన్ సక్సేనా ఫేమ్ డైరెక్టర్ శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 31వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. 
 

613


మహేంద్ర (రాజ్‍కుమార్ రావ్).. తన భార్య మహిమ (జాన్వీ కపూర్)లోని క్రికెట్ టాలెంట్‍ను గుర్తిస్తాడు. క్రికెట్‍లో కలలను నేరవేర్చుకునేందుకు ఆమెకు మహేంద్ర కోచింగ్ ఇవ్వడం చుట్టూ మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రం నడుస్తుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు గాయాలయ్యాయని జాన్వీ కపూర్ చెప్పారు.
 

713


అలాగే "జీవితంతో కొన్ని సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాలి, సవాళ్లను ఎదుర్కొవాలి, అలాగే అభిమానులు, ప్రేక్షకులను మెప్పించాలంటే కథానాయికగా బలమైన కథలు ఎంచుకోవాలి. వాటితో ప్రేక్షకులను మెప్పించాలి. అందుకోసం చాలా కష్టపడాలి’’ అంటున్నారు  జాన్వీకపూర్‌.

813


 ‘దేవర’తో తెలుగులోకి ‌ ఎంట్రీ ఇస్తోంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె గ్రామీణ యువతిగా నటిస్తోంది. ఈ క్రమంలో  జాన్వీ కపూర్ నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటోంది.  హాట్ హాట్ ఫోటోషూట్స్ తో, వరుస ఇంటర్వ్యూలతో అనే ఎప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఈ సినిమా తర్వాత ఆమె సౌత్ లో ఫుల్ బిజీ అవుతుందని భావిస్తున్నారు. దాంతో అసలు ఈ సినిమా నిమిత్తం ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది.

913


     మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు   ‘దేవర’చిత్రానికి ఆమెకు 10 కోట్లు పే చేస్తున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్స్ లో హైయిస్ట్ పేమెంట్ ఇదే కావటం విశేషం. పూజ హెగ్డే, రష్మిక, శ్రీలీల 4 కోట్లు దగ్గరే ఆగిపోతే వాళ్లందరినీ దాటి ఆమె 10 కోట్లులోకి వెళ్లింది. అయితే దేవర మొదట పార్ట్ గా రెండు పార్ట్ లకు కలిపా అనేది తెలియాల్సి ఉంది. అయితే రెండు పార్ట్ లకు కలిపి అంటున్నారు. అంటే ఒక్కో పార్ట్ కు 5 కోట్లు అందుకున్నట్లు అన్నమాట. 
 

1013


     దేవర చిత్రాన్ని  ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మధ్య.. కళ్యాణ్ రామ్ సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్పి హైప్ ఎక్కించాడు. మునుపెన్నడూ లేని విధంగా దేవర ఉండబోతుంది అని, రికార్డులు గల్లంతే అని చెప్పుకొచ్చాడు. దీంతో దేవరపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 
 

1113

 జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ  దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు.
 

1213

      ఇక దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్   విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.   ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  

1313

జాన్వీ ఇప్పటివరకు పలు సినిమాలతో నటిగా మెప్పించినా ఒక్క కమర్షియల్ హిట్ కూడా అందుకోలేదు. మరి ఈ సినిమాతో అయినా కమర్షియల్ హిట్ కొడుతుందా? లేక దేవర సినిమాతోనే కమర్షియల్ హిట్ అందుకుంటుందా చూడాలి.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
బాలీవుడ్
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు
Recommended image2
Toxic: టాక్సిక్ మూవీ ఎఫెక్ట్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్.. దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయా ?
Recommended image3
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved