- Home
- Entertainment
- ప్రేమలో పడ్డ ఈషా రెబ్బా? ఎదురు చూస్తున్నా అంటూ రొమాంటిక్ పిక్స్ షేర్ చేసిన తెలుగు పిల్ల
ప్రేమలో పడ్డ ఈషా రెబ్బా? ఎదురు చూస్తున్నా అంటూ రొమాంటిక్ పిక్స్ షేర్ చేసిన తెలుగు పిల్ల
ఈషా రెబ్బా ప్రేమలో పడ్డట్లు ఉంది. చీరలో రొమాంటిక్ గా తయారై ప్రియుడు రాక కోసం ఎదురుచూస్తుంది. ఈషా రెబ్బా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Eesha Rebba
వరంగల్ పిల్ల ఈషా రెబ్బాకు పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. కెరీర్ పరుగులో వయసొచ్చిన విషయం మర్చిపోయింది. ఎట్టకేలకు ప్రేమలో పడ్డట్లుంది. ఎదురుస్తున్నా అంటూ గుమ్మం వద్ద నిల్చుంది. ఈషా రెబ్బా రొమాంటిక్ పోజులు వైరల్ అవుతున్నాయి.
Eesha Rebba
ఇక ఈషా రెబ్బా ఎదురుచూస్తున్నా అంటూ పెట్టిన పోస్ట్ అర్థం అదేనా? ఆమె ప్రేమలో పడ్డారా? అని నెటిజెన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో నీ కోసం నేను వస్తున్నా, అంటూ కొంటె కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టులో ఈషా రెబ్బా మత్తెక్కిస్తోంది.
Eesha Rebba
ఈషా రెబ్బా కెరీర్ ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆమె ఓ తమిళ ప్రాజెక్ట్ ప్రకటించారు. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట.కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది. అలాగే దయ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దయ సైతం క్రైమ్ థ్రిల్లర్. ఇది హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.
Eesha Rebba
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈషా వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. అనంతరం అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో మెయిన్ లీడ్ చేసింది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.
Eesha Rebba
బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈషాకు అడపాదడపా అవకాశాలు తప్పితే కెరీర్ కి బూస్ట్ ఇచ్చే సినిమా పడటం లేదు. ఈషాకు తెలుగులో ఫేమ్ తగ్గింది. దీంతో పర భాషల్లో సక్సెస్ కావాలని చూస్తున్నారు.
Eesha Rebba
టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈషాను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆమె ఇతర పరిశ్రమల వైపు చూస్తుంది. కెరీర్ బిగినింగ్ నుండి సెకండ్ హీరోయిన్, సప్పోర్ట్ రోల్స్ మాత్రమే ఈషాకు దక్కాయి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా రెబ్బా నటించినప్పటికీ, ఆమెది కనీస ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, సినిమా హిట్ అయినా ఈషాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. అక్కినేని హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిశారు ఈషా.