MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • హీరోయిన్ బ్లౌజ్ కోసం స్టార్ డైరెక్టర్ కష్టాలు, అసభ్యంగా ఉందంటూ.. షూటింగ్ ఆపేసి రాత్రికి రాత్రే, హ్యాట్సాఫ్

హీరోయిన్ బ్లౌజ్ కోసం స్టార్ డైరెక్టర్ కష్టాలు, అసభ్యంగా ఉందంటూ.. షూటింగ్ ఆపేసి రాత్రికి రాత్రే, హ్యాట్సాఫ్

ఇటీవల సదా జయం, అపరిచితుడు చిత్రాల షూటింగ్ సమయంలో జరిగిన సంగతులని గుర్తు చేసుకుంటోంది. జయం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సదా ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ కావడంతో క్రేజీ హీరోయిన్ గా మారింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 05 2024, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హీరోయిన్ సదా ప్రస్తుతం బుల్లితెరపై డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. నాలుగు పదుల వయసు దాటినా ఇంతవరకు సదా పెళ్లి ఊసు ఎత్తడం లేదు. సదా గ్లామర్ మాత్రం తగ్గడం లేదు. ఆమె ఇంకా జయం, అపరిచితుడు టైంలో ఉన్నట్లే కనిపిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇటీవల సదా జయం, అపరిచితుడు చిత్రాల షూటింగ్ సమయంలో జరిగిన సంగతులని గుర్తు చేసుకుంటోంది. జయం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సదా ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ కావడంతో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఆమెకి శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. 

37

అనుకున్నట్లుగానే అపరిచితుడు కూడా బ్లాక్ బస్టర్ అయింది. అయితే అపరిచితుడు చిత్రం కోసం శంకర్ ఆఫీస్ నుంచి కాల్ రావడంతో సదా మొదట నమ్మలేదు. ఎవరో కావాలనే ఫ్రాంక్ చేస్తున్నారు అని అనుకుందట. పడే పడే చేస్తుండడంతో ఫోన్ మాట్లాడిన తర్వాత నిజంగానే శంకర్ నుంచి పిలుపు వచ్చిందని గ్రహించింది. 

47

అక్కడ ఉన్నది శంకర్ అయినప్పటికీ సదా తాను చెప్పదలుచుకున్నది మొహమాటం లేకుండా చెప్పేసిందట. సర్ నేను మరీ పొట్టి బట్టలు వేసుకోను. నాకు కంఫర్టబుల్ కాదు అని చెప్పేసిందట. దీనితో శంకర్ అలాగే అమ్మా.. ఈ మూవీలో మరీ పొట్టి బట్టలు అవసరం లేదు అని అన్నారట. 

57

తన కాస్ట్యూమ్స్ మొత్తం ముంబై నుంచి డిజైన్ చేయించి శంకర్ గారు తెప్పించేవారు. అయ్యంగారి అనే సాంగ్ షూటింగ్ లో మాత్రం ఇబ్బంది వచ్చింది. ముంబై నుంచి వచ్చిన బ్లౌజ్ బాగా డీప్ నెక్ గా ఉంది. వాళ్ళు కొలతలు తీసుకోవడం తప్పుగా తీసుకున్నారో ఏమో కానీ బ్లౌజ్ చాలా అసభ్యంగా వచ్చింది. లేకపోతే కావాలనే ఇలా ఎక్స్ ఫోజింగ్ కోసం డిజైన్ చేయించారేమో అనే విషయం కూడా తెలియదు. 

67

నేను శంకర్ సర్ కి ఆల్రెడీ చెప్పాను కాదా ఇలాంటి డ్రెస్ లు వేసుకోనని.. ఇప్పుడు షూటింగ్ మధ్యలో ఎలా చెప్పాలి అని టెన్షన్ పడ్డాను. దీనితో సదా తన ఇబ్బంది గురించి అసిస్టెంట్ కి చెప్పింది. అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్ కి చెప్పారు. దీనితో శంకర్ ఆ షూటింగ్ ఆపేసి ఆ బ్లౌజ్ ని నైట్ ఫ్లైట్ కి ముంబై పంపించారు. రాత్రికి రాత్రే కొత్త బ్లౌజ్ డిజైన్ చేయించారు. మార్నింగ్ బ్లౌజ్ రాగానే షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. 

77

శంకర్ నుంచి మీరు ఏం చేర్చుకున్నారు అని అడిగితే నేను ఈ విషయమే చెబుతాను. ఆయన నాకు సింపుల్ గా నో చెప్పి ఆ బ్లౌజ్ వేసుకోవాల్సిందే అని అనొచ్చు. కానీ అలా చేయలేదు. ఎంత గొప్ప వ్యక్తి ఎంతలా ఒదిగి ఉంటాడో చెప్పేందుకు ఇదే నిదర్శనం.అందుకే శంకర్ అంత గొప్ప డైరెక్టర్ అయ్యారు అంటూ సదా పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Recommended image2
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image3
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved