MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగాస్టార్‌ ఫ్యామిలీ నుంచి సీఎం కావడం పెద్ద కష్టం కాదు.. లోపం అదే.. శివాజీ సంచలన వ్యాఖ్యలు..

మెగాస్టార్‌ ఫ్యామిలీ నుంచి సీఎం కావడం పెద్ద కష్టం కాదు.. లోపం అదే.. శివాజీ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌ బాస్ 7 లో హల్‌చల్‌ చేసి శివన్నగా పాపులర్‌ అయిన నటుడు శివాజీ మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి ఫ్యామిలీ నుంచి సీఎం కావడంపై ఆయన స్పందించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 30 2023, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్‌ బాస్‌ 7 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని అదరగొట్టాడు నటుడు శివాజీ. హౌజ్‌లో పెద్దగా వ్యవహరించాడు. శివన్నగా పేరు తెచ్చుకున్నాడు. అందరికి పెద్ద దిక్కుగా నిలిచాడు. ముఖ్యంగా ఛాణక్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. తనదైన ఆట తీరుతో ఇతరులను ఓడించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మెప్పించాడు. బిగ్‌ బాస్‌ విన్నర్‌ కాకపోయినా తనకు రావాల్సిన గుర్తింపు, తనకు రావాల్సిన పేరు వచ్చింది. నటుడిగా కమ్‌ బ్యాక్‌కి కావాల్సిన హైప్‌ వచ్చింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే శివాజీ అంటే ముక్కుసూటి తనానికి కేరాఫ్‌. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడతారు అంటారు. తాజాగా ఆయన మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు తలుచుకుంటే సీఎం కావడం పెద్ద సమస్య కాదన్నారు. పవన్‌ కళ్యాణ్‌ లాంటి వాళ్లతో కలిసి రాజకీయాల్లో పనిచేయోచ్చు కదా అనే ప్రశ్నకి ఆయన రియాక్ట్ అయ్యారు. `నాకు తెలిసి మెగాస్టార్‌ ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్స్ బేస్‌ ఎవరికీ లేదు. అటు ఆంధ్రప్రదేశ్‌లోగానీ, ఇటు తెలంగాణలోనూ వారికి మించిన ఫ్యాన్స్ మరెవ్వరికీ లేరు. వాళ్లు సీఎం కావాలనుకుంటే పెద్ద కష్టమైన పని కాదు. అయితే ఎక్కడో చిన్న లోపం జరుగుతుంది. ఆ లోపాన్ని సరిదిద్దుకుని వెళితే వాళ్ల ఫ్యామిలీ నుంచి సీఎం కావడం పెద్ద విషయమే కాదు` అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 

36

తాను ఏదైనా ఓపెన్‌గా చెబుతానని, కొందరు ఫీల్‌ కావచ్చు, కాకపోవచ్చు కానీ తాను నిజం మాట్లాడతా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా అని వెల్లడించారు శివాజీ. ఇక రాజకీయాల నుంచి ఎందుకు దూరమయ్యారనే ప్రశ్నకి స్పందిస్తూ. తాను రాజకీయాల్లో సేవ చేయాలనుకున్నా, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యం రాజకీయాల్లోకి వెళ్లాను. అక్కడ ప్రజల గురించే మాట్లాడాను. ఈ క్రమంలో బీజేపీ పార్టీలో చేరాను. కానీ వాళ్లు తన ప్రామిస్‌ని ఎప్పుడైతే పక్కన పెట్టారో, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాను. 

46

ప్రజలకు సంబంధించిన విషయాలపై తాను ఇప్పుడు స్పందిస్తాను. అయితే ప్రజలకు సంబంధించిన నేను ప్రత్యేక హోదా అనే అంశాన్ని నేను తీసుకున్నా. దానికి లీడర్‌ షిప్‌ చాలా ముఖ్యం. లీడర్స్ కరెక్ట్ గా ఉండాలి. మనకు రావాల్సిన, ఈ తరానికి చెందాల్సిన మౌళిక సదుపాయాలు, వసతులు, వనరులు అన్నీ రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి. మనకు రావాల్సిన మంచి నీళ్లుగానీ, హెల్త్ గానీ, పవర్‌ గానీ, ఉద్యోగాలు గానీ, ఇలా ప్రతిదీ ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నీ రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి.

56

 ప్రజల్లో ప్రశ్నించే తత్వం పోయింది. కాస్ట్ ఫీలింగ్‌ పెరిగింది, అవసరమైతే, రాముడు, లేదంటే అల్లా, లేదంటే జీసస్‌, ఇలాంటి వాటికి రకరకాలుగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణి పెరిగిపోయింది. ఈ తరుణంలో ఒక మనిషి ఎంత కాలం పోరాడగలను, కానీ పదేళ్ల పాటు పోరాడాను. ప్రయత్నించాను. కానీ తప్పుకున్నా. అయితే ప్రజల గొంతుకుగా మాత్రం తాను ఎప్పుడూ ఉంటాను. కానీ నన్ను నటుడిగా నిలబెట్టి, నా గొంతుని పది మందికి తెలిసేలా కారణమైన సినిమాని మాత్రం వదలను. ఇకపై కంటిన్యూ చేస్తాను. ఈ క్రమంలోనే `బిగ్‌ బాస్‌`గానీ, వెబ్‌ సిరీస్ గానీ చేశాను. మరో సినిమా కూడా చేయబోతున్నా. త్వరలో అనౌన్స్ చేస్తానని తెలిపారు శివాజీ. ఈ సందర్భంగానే మెగా ఫ్యామిలీతో పనిచేయడంపై ఆయన పై విధంగా రియాక్ట్ అయ్యారు. 
 

66

బిగ్‌ బాస్‌ షో కంటే ముందే తాను `యాష్‌ ట్యాగ్‌ 90ః ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌` అనే వెబ్‌ సిరీస్‌ లో నటించారు. వాసుకీ ఆయనకు పెయిర్‌గా చేసింది. ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహించారు. నవీన్‌ మేడారం నిర్మించారు. ఇది జనవరి 5న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో శివాజీ పాల్గొని మాట్లాడారు. 90కి కనెక్ట్ అయ్యే వెబ్‌ సిరీస్‌ అని తెలిపారు.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Recommended image2
Bharathiraja: భారతీరాజా ఆస్తికి వారసులెవరు, ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడంటే?
Recommended image3
Folk Song: ఈ పాట వింటే పూనకాలే..120 మిలియన్లతో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved