- Home
- Entertainment
- Anasuya: రాంచరణ్ తో అలా, బన్నీతో ఇలా.. ఇప్పుడు మెగాస్టార్ 'ఆచార్య'లో అనసూయ షాకింగ్ రోల్
Anasuya: రాంచరణ్ తో అలా, బన్నీతో ఇలా.. ఇప్పుడు మెగాస్టార్ 'ఆచార్య'లో అనసూయ షాకింగ్ రోల్
త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'ఆచార్య'. ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

Anasuya Bharadwaj
త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'ఆచార్య'. ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో తొలిసారి చిరంజీవి నటిస్తుండడంతో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.
కొరటాల శివ ఆచార్య చిత్రంతో వింటేజ్ మెగాస్టార్ ని పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ లుక్, టీజర్స్, సాంగ్స్ కి అదే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. రాంచరణ్, పూజా హెగ్డే ఈ చిత్రంలో కామియో రోల్స్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది..
ఇటీవల కాలంలో అనసూయ టాలీవుడ్ లో ఎలాంటి పాత్రలు ఎంచుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంచరణ్ రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా అద్భుతమైన నటనతో అనసూయ మెప్పించింది. ఇటీవల అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో దాక్షాయణి పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో ఆశ్చర్యపరిచింది. అలాగే చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా అనసూయ నెగిటివ్ రోల్ లో నటిస్తోందట.
ఆచార్య చిత్రంలో కూడా అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది అని, ఆమె రోల్ షాకింగ్ గా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ ఈ చిత్రాన్ని దేవాలయాల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. దేవాదాయ శాఖ ఆస్తుల విషయంలో రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతిని ఎండగట్టే పాత్రలో మెగాస్టార్ కనిపించబోతున్నారు.
Anasuya Bharadwaj
ఇక అనసూయ రోల్ ప్రయోగాత్మకంగా ఉండబోతోందట. అనసూయ లాంటి గ్లామర్ బ్యూటీ ఈ చిత్రంలో దేవదాసి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. వివాహం చేసుకోకుండా దేవుడి సేవకే అంకితం అవుతూ, దేవాలయాల్లో నాట్య ప్రదర్శన ఇచ్చే మహిళగా అనసూయ కనిపించబోతున్నట్లు టాక్. ఆమె లుక్, యాక్టింగ్ ఈ చిత్రంలో ఫ్యాన్స్ కి సర్ ప్రైజింగ్ గా ఉండనున్నాయట. ఒకరకంగా అనసూయకు ఈ పాత్ర సాహసమే అని అంటున్నారు.
బుల్లితెరపై అనసూయ గ్లామర్ ఒలక బోసినట్లు మరే యాంకర్ అందాలు ఆరబోయరు. అనసూయ కళ్ళు చెదిరే హాట్ లుక్ లో టివి కార్యక్రమాల్లో మెరుస్తోంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలని తరచుగా షేర్ చేస్తోంది.