MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వయసు 49 ఏళ్ళు, ఆంటీ పాత్రల్లో నటించను.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ డైరెక్ట్ గా చెప్పేసిందిగా 

వయసు 49 ఏళ్ళు, ఆంటీ పాత్రల్లో నటించను.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ డైరెక్ట్ గా చెప్పేసిందిగా 

ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన అమీషా పటేల్ ఇప్పుడు బోల్డ్ హీరోయిన్ గా మారిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో అమీషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అయింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 23 2024, 08:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన అమీషా పటేల్ ఇప్పుడు బోల్డ్ హీరోయిన్ గా మారిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో అమీషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో అమీషా పటేల్ కు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి కూడా. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

కానీ అమీషా పటేల్ టాలీవుడ్ లో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. బాలీవుడ్ లో కూడా ఆమెకు అంతాగా కలసి రాలేదు. స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులర్ కాలేకపోయినప్పటికీ అవకాశాలు దక్కించుకుంది. ఇక అమీషా పటేల్ కి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.    

36

అమీషా పటేల్ వయసు 49 ఏళ్ళు. అయినప్పటికీ ఆమె తన ఫిజిక్ ని కాపాడుకుంటూ హాట్ గా కనిపిస్తోంది. కుర్ర హీరోయిన్లు సైతం అసూయ అమీషా గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. గత ఏడాది అమీషా పటేల్ హీరోయిన్ గా నటించిన గదర్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 

46

ఆ మూవీ ఇచ్చిన సక్సెస్ ధీమానో ఏమో కానీ తాజాగా అమీషా పటేల్ క్రేజీ కామెంట్స్ చేసింది. తన వయసు గురించి కూడా మరచిపోయి వ్యాఖ్యలు చేసింది. అమీషా పటేల్ మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ ఆంటీ పాత్రల్లో, తల్లి  పాత్రల్లో నటించనని తేల్చి చెప్పేసింది. 

56

తనకి అవకాశాలు వచ్చినంత కాలం హీరోయిన్ గానే నటిస్తానని తెలిపింది. తన వయసున్న నటీమణులు చాలా మంది ఆంటీలుగా నటిస్తున్న సంగతి తనకి తెలుసు అని.. కాకపోతే ఆ పాత్రలో నటించడం తనకి ఇష్టం లేదని అమీషా పేర్కొంది. 

66

అమీషా పటేల్ తెలుగులో బద్రి తో పాటు.. మహేష్ బాబు నాని చిత్రంలో కూడా నటించింది. నరసింహుడు చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. సౌత్ లో మాత్రం ఆమెకి ఎలాంటి అవకాశాలు ప్రస్తుతం లేవు. అమీషా పటేల్ ఇంకా వివాహ బంధంలోకి కూడా అడుగుపెట్టలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలయ్య జాతకంలో అతి పెద్ద గండం, ఆదివారం ఆయన అస్సలు చేయకూడని పని ఏదో తెలుసా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- దీప, CEO పోటీ నుంచి తప్పుకుంటుందా?
Recommended image3
Jr NTR House: జూనియర్ ఎన్టీఆర్ ఇంద్రభవనం గురించి తెలుసా.. 25 కోట్లతో డ్రీమ్ హౌస్ నిర్మించుకున్న యంగ్ టైగర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved