- Home
- Entertainment
- Allu Sneha: తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ భార్య.. ఆమె ధరించిన కోటు ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
Allu Sneha: తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ భార్య.. ఆమె ధరించిన కోటు ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
అల్లు అర్జున్ తరహాలోనే అతని సతీమణి అల్లు స్నేహ కూడా ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ.. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.

Allu Sneha Reddy
అల్లు అర్జున్ తరహాలోనే అతని సతీమణి అల్లు స్నేహ కూడా ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ.. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అల్లు అర్జున్, తన పిల్లల గురించి విశేషాలు ఫ్యాన్స్ కి తెలియజేస్తూ ఉంటుంది.
Allu Sneha Reddy
అల్లు అర్జున్ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు. ఇటీవల అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు సెర్బియాలో ఘనంగా జరిగాయి. అలాగే యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో బన్నీ ఫ్యామిలీ టూర్ ఎంజాయ్ చేస్తోంది.
Allu Sneha Reddy
అల్లు అర్జున్, స్నేహ వెకేషన్ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా అల్లు స్నేహ ధరించిన ఓ కోటు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్నేహ అత్యంత ఖరీదైన లూయిస్ విట్టన్ కోటు ధరించింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Allu Sneha Reddy
స్నేహ ధరించిన కోటు గురించే ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆ కోటు విలువ రూ 5,09,311. ఆ కోటు ధర తెలుసుకున్న నెటిజన్లు షాక్ కి గురవుతున్నారు. ఫ్యాషన్ విషయంలో స్నేహ తగ్గేదే లే అంటోందని కామెంట్స్ పెడుతున్నారు.
Allu Sneha Reddy
అలాగే మరికొన్ని గ్లామర్ పిక్స్ ని కూడా స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అల్లు స్నేహ, మహేష్ సతీమణి నమ్రత.. రాంచరణ్ సతీమణి ఉపాసన తరచుగా డిన్నర్ కి హాజరవుతుంటారు.
Allu Sneha Reddy
ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. పుష్ప మొదటి భాగంలో కంటే రెండవ భాగంలో బన్నీ డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.