- Home
- Entertainment
- ఐశ్వర్యా రాజేష్‌ని ఇలా చూస్తే కుర్రాళ్ల ఫ్యూజులెగిరిపోవాల్సిందే.. పింగ్ డ్రెస్‌లో కైపెక్కిస్తున్న హాట్ భామ..
ఐశ్వర్యా రాజేష్‌ని ఇలా చూస్తే కుర్రాళ్ల ఫ్యూజులెగిరిపోవాల్సిందే.. పింగ్ డ్రెస్‌లో కైపెక్కిస్తున్న హాట్ భామ..
ఐశ్వర్య రాజేష్ డస్కీ అందాలతో కనువిందు చేస్తుంటుంది. నిండైన డ్రెస్‌లో గ్లామర్ ఫోటోలకు పోజులిస్తూ ఆకట్టుకుంటుందీ ఈ టాలెంటెడ్ బ్యూటీ. తాజాగా సండే ట్రీట్ ఇచ్చింది.

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ తాజాగా వీకెండ్ ట్రీట్ ఇచ్చింది. ఆదివారం వేళ ఆమె అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. పింక్ కలర్ డ్రెస్‌లో పరువాల విందు వడ్డించింది. కిర్రాక్ పోజులిస్తూ నెటిజన్ల మైండ్ బ్లాక్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.
ఐశ్వర్యా రాజేష్ ఇందులో మరింత అందంగా ఉంది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లు, పొట్టి దుస్తుల్లో అడపాదడపా మెరిసే ఈ భామ ఇప్పుడు నిండైనదుస్తుల్లో కనిపించడం విశేషం. అయినా ఈ అమ్మడి హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదు సరికదా, మరింతగా పెరిగింది. ఐశ్వర్యా ఏం చేసినా, ఎలా కనిపించినా హాట్‌గానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఐశ్వర్య రాజేష్ ట్రెడిషనల్ లుక్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది. పాత్ర, కథ డిమాండ్ చేస్తే ఇంటెన్స్ రోల్స్ చేసేందుకు సిద్ధంగానే ఉంటుంది. కానీ ఆ పాత్ర ఇంపాక్ట్ సినిమాపై, చూసే ఆడియెన్స్ పై ఉండాల్సిందే. అందుకే ఇండస్ట్రీలో, సౌత్‌లో చాలా స్పెషల్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది ఐశ్వర్యా రాజేష్.
ఐశ్వర్యా రాజేష్ ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె ఏజ్‌కి మించిన పాత్రలు పోషిస్తూ వాహ్ అనిపిస్తుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పిస్తుంది. పాత్రని రక్తి కట్టిస్తుంది.
ఇక తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది. ఓ రకంగా టాలీవుడ్ ఈ బ్యూటీకి కలిసి రాలేదు. `కౌసల్య కృష్ణమూర్తి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆదరణకు నోచుకోలేదు. ఎంతో ఆశలు పెంచుకున్న ఈ సినిమా డిజప్పాయింట్ చేసింది. ఇది తమిళ చిత్రానికి రీమేక్. అక్కడ పెద్ద హిట్, కానీ తెలుగులో పరాజయం చెందింది.
ఆ తర్వాత `మిస్ మ్యాచ్`, `వరల్డ్ ఫేమస్ లవర్`, `టచ్ జగదీష్`, `రిపబ్లిక్` చిత్రాల్లో మెరిసింది. ఈ సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. వరల్డ్ ఫేమస్ లవర్‌లో ఏకంగా ఇద్దరు పిల్లలకు తల్లిగానూ, విజయ్ దేవరకొండకి భార్యగా నటించి మెప్పించింది. నటిగా పేరొచ్చిన సక్సెస్‌రాలేదు. దీంతో తెలుగులో ఛాన్స్ లు తగ్గిపోయాయి. ఇప్పుడు తమిళం, మలయాళంలో ఆరు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఐశ్వర్యా రాజేష్.