MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Naresh-Pavitra Lokesh: 19 ఏళ్లకే వివాహం... నరేష్ ముగ్గురు భార్యలు ఎవరు? ఎందుకు విడిపోయారు?

Naresh-Pavitra Lokesh: 19 ఏళ్లకే వివాహం... నరేష్ ముగ్గురు భార్యలు ఎవరు? ఎందుకు విడిపోయారు?

కొత్త ఏడాది ప్రారంభంలో భారీ షాక్ ఇచ్చారు నరేష్. నటి పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకుకోన్నట్లు ప్రకటించారు. నాలుగో పెళ్ళికి సిద్ధమైన నరేష్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 01 2023, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Naresh

Naresh

2022 టాలీవుడ్ వివాదాల్లో నరేష్-పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఒకటి. నటి పవిత్ర లోకేష్ ని నరేష్ వివాహం చేసుకున్నారన్న కథనాలు తెరపైకి వచ్చాయి. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయంలో నరేష్-పవిత్ర జంటగా పూజలు నిర్వహించారు. వివాహం చేసుకున్న ఈ జంట దైవదర్శనం చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Naresh

Naresh

పెళ్లి వార్తలను నరేష్ ఖండించారు. పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నానని ఆయన తెలియజేశారు. వివాహ వ్యవస్థపై నమ్మకం లేదన్న నరేష్... ప్రస్తుతానికి పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకునే ఆలోచన లేదన్నారు. నమ్మకమైన, ప్రేమించే వ్యక్తి తోడు కావాలని కోరుకున్నాను. అందుకే పవిత్ర లోకేష్ తో కలిసి జీవిస్తున్నాను, అని స్పష్టత ఇచ్చారు.

39
Naresh

Naresh

అయితే నరేష్-పవిత్ర లోకేష్ బంధాన్ని ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఖండించారు. నాకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో ఎలా సంబంధం పెట్టుకుంటాడంటూ ఆరోపణలు చేశారు. మైసూర్ హోటల్ గదిలో ఉన్న నరేష్, పవిత్రలపై రమ్య దాడికి ప్రయత్నం చేశారు. ఈ ట్రయాంగిల్ డ్రామా పతాక శీర్షికలకు ఎక్కింది. 
 

49
Naresh

Naresh


తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అది కూడా ఒక రొమాంటిక్ వీడియో షేర్ చేసి తమ పెళ్లి వార్త పంచుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. 2023 ప్రారంభంలో జరిగిన ఈ సంఘటన టాలీవుడ్ ని ఊపేస్తోంది. ఈ క్రమంలో నరేష్ పెళ్లి చేసుకున్న ముగ్గురు భార్యలు ఎవరు? ఎందుకు విడాకులు ఇచ్చారు? వారి పిల్లలు ఎవరో చూద్దాం?
 

59
Naresh

Naresh

నరేష్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తన మూడు వివాహాల గురించి వివరణ ఇచ్చారు. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో స్పష్టత ఇచ్చారు. నరేషే మాట్లాడుతూ... 17 ఏళ్లకే హీరోగా పరిశ్రమలో అడుగుపెట్టాను. 19 ఏళ్లకు పెద్దలు నాకు పెళ్లి చేశారు. అంటే దాదాపు బాల్య వివాహం. ఆ వయసులో నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. ఆమెకు అనారోగ్యం అందుకే విడిపోవాల్సి వచ్చింది. 
 

69


తర్వాత రెండో వివాహం చేసుకున్నాను. మనస్పర్థలతో విడిపోయాము. మూడో భార్యతో కూడా విభేదాలతో విడిపోవాల్సి వచ్చింది. ఇందులో తప్పెవరిది అంటే... ఎవరినీ నిందించాడనికి లేదు. ఒకప్పుడు ఎక్కడో ఒక ఫ్యామిలీ కోర్ట్ ఉండేది. ఎప్పుడు పదుల సంఖ్యలో ఉన్నాయి. కారణం విడిపోయే వారి సంఖ్య ఎక్కువైపోయింది. 

79


ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పరిస్థితులు వేరు. భార్య హౌస్ వైఫ్ గా ఉండేది. ఇల్లు చక్కబెట్టడమే ఆమె ప్రధాన కర్తవ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు భార్య భర్త ఉద్యోగం చేస్తున్నారు. ఆది కూడా విడాకులకు ఒక కారణం. ఇక చుట్టాలు, పక్కాలు ఉండనే ఉన్నారు. ఇలా అనేక కారణాలున్నాయి. విడిపోయిన వారితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, అని నరేష్ చెప్పుకొచ్చారు. 
 

89


నరేష్ మొదటి వివాహంగా సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను చేసుకున్నాడు. వీరికి ఒక అబ్బాయి. అతని పేరు నవీన్ విజయ కృష్ణ. ఇతడు ఎడిటర్, హీరోగా కూడా ఓ మూవీ చేశాడు. మొదటి భార్యతో విడాకులు అనంతరం దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలిని వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు కూడా ఒక కొడుకు ఉన్నాడు. అతడు పెయింటింగ్ ఆర్టిస్ట్ అని నరేష్ వెల్లడించారు. 
 

99


అనంతరం కాంగ్రెస్ సీనియర్ లీడర్ రఘువీరారెడ్డి తమ్ముడు కూతురు రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. ఐదేళ్ల క్రితం రమ్య రఘుపతితో నరేష్ విడిపోయారు. నాలుగో వివాహంగా నటి పవిత్ర లోకేష్ ని చేసుకోబోతున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved