MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • వైఎస్ జగన్ పాత్రలో నటించడం చాలా రిస్క్.. యాత్ర 2పై జీవా అంత మాట అన్నాడేంటి..

వైఎస్ జగన్ పాత్రలో నటించడం చాలా రిస్క్.. యాత్ర 2పై జీవా అంత మాట అన్నాడేంటి..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర చిత్రం 2019లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jan 18 2024, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర చిత్రం 2019లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు రిలీజ్ కావడంతో ఆ చిత్రం వైఎస్ జగన్ కి, వైసీపీకి బాగా ఉపయోగపడిందనే భావన చాలా మందిలో ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

యాత్ర దర్శకుడు మహి వి రాఘవ్ మరోసారి ఎన్నికల ముందు సందడి చేసేందుకు యాత్ర 2 చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. యాత్ర 2లో వైఎస్ఆర్ మరణం.. వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లో ఎదిగిన విధానం హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే జగన్ చేసిన పాద యాత్రని ఎమోషనల్ గా మహి వి రాఘవ్ చూపించబోతున్నారు.    

36

యాత్ర 2 చిత్రం ఎన్నికల హీట్ మరింత పెంచేలా ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ చిత్రంలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన యాత్ర 2టీజర్ లో జీవా జగన్ పాత్రలో ఒదిగిపోయారు. 

46
jiiva

jiiva

తాజాగా ఇంటర్వ్యూలో జీవా యాత్ర 2 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాత్ర 2 చిత్రానికి అంగీకారం తెలిపేందుకు జీవా చాలా ఆలోచించాడట. 'నాకు జగనన్న జర్నీ చాలా ఇష్టం. కానీ యాత్ర 2 ఆఫర్ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నా. జగన్ ప్రభావవంతమైన వ్యక్తి.  అలాంటి వ్యక్తి పాత్రలో నటించడం చాలా రిస్క్. ఆ పాత్రకి నేను న్యాయం చేకుంటే నా కెరీర్ పై తీవ్ర ప్రారంభం చూపుతుంది అని తెలిపాడు. 

56

కానీ టీజర్ రిలీజ్ అయ్యాక జగన్ పాత్రలో జీవా ఒదిగిపోయాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. జగన్ బాడీ లాంగ్వేజ్ ని డైలాగ్ డెలివరీని జీవా పర్ఫెక్ట్ గా చూపించారు. యాత్ర 2 చాలా వరకు కల్పితంగా ఉంటుంది అని డైరెక్టర్ మహి వి రాఘవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

66

జగన్ పాదయాత్ర గురించి 2019లో ముఖ్యమంత్రిగా ఎదిగిన విధానం గురించి మహి వి రాఘవ్ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. అదే విధంగా జగన్ జైలుకు ఎలా వెళ్లారు అనే అంశాన్ని కుట్ర కోణంలో మహి వి రాఘవ్ చూపించబోతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image2
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Recommended image3
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved