ఆడేది నెలకి ఒకటో రెండో మ్యాచులు... దానికే అలిసిపోతామా! వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై ఇషాంత్ శర్మ...
టీమిండియా తరుపున 100కి పైగా టెస్టులు ఆడిన ఆఖరి ప్లేయర్ ఇషాంత్ శర్మ. టీమిండియా తరుపున 105 టెస్టులు ఆడి 311 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ, నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు..
Ishant Sharma and Virat Kohli
34 ఏళ్ల వయసులో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్న ఇషాంత్ శర్మ, ఢిల్లీ తరుపున రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో పాల్గొంటున్నాడు. కొన్నాళ్లుగా వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌తో సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు ఇషాంత్ శర్మ...
‘ఇప్పుడు నేను చెప్పాలనుకుంటోంది ఒక్కటే... వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇప్పుడు దీని గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు రెస్ట్ కావాలని పక్కనబెడుతున్నారు...
Ishant Sharma
నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడడం మొదలెట్టినప్పటి నుంచి ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు. నేను టీమ్‌లోకి వచ్చిన కొత్తలో మిట్టమధ్యాహ్నం ఒంటిగంటకు మాకు బాల్ ఇచ్చేవాళ్లు. సాయంత్రం దాకా బౌలింగ్ చేయించేవాళ్లు..
Ishant-Sharma
అలా బౌలింగ్ వేయడం వల్లే సుదీర్ఘ స్పెల్స్ వేసేలా రాటుతేలాం. రంజీ ట్రోఫీలో, టీమిండియా తరుపున ఆడినప్పుడు కూడా వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా సుదీర్ఘ స్పెల్స్ వేశాను. ఇప్పటికీ వేయగలను..
Ishant Sharma
దేశవాళీ క్రికెట్ ఆడి టీమిండియాలోకి వస్తే రెండు మూడు మ్యాచులు ఆడిన తర్వాత ఎవ్వరూ అలిసిపోయాం.. రెస్ట్ కావాలని అడగరు. దేశవాళీ క్రికెట్ ఆడాలనుకుంటే ఎవ్వరూ ఆపరు. రంజీ ట్రోఫీలో ఆడడానికి కూడా చాలా ప్రిపరేషన్ కావాలి...
ఐఏఎస్ పరీక్ష పాస్ అవ్వాలనుకుంటే రోజుకి 16 గంటలు చదవాలి. అలాగే రంజీ ట్రోఫీలో బౌలింగ్ చేయాలంటే కూడా సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేయాలి. రోజంతా ఫీల్డింగ్ చేయాలి, రోజులో కనీసం 20 ఓవర్లు బౌలింగ్ చేయాలి...
టెస్టు మ్యాచుల సంఖ్య చాలా తగ్గిపోయింది. నెలకు ఒకటో రెండో మ్యాచులు మాత్రమే జరుగుతున్నాయి. అలాంటప్పుడు రెస్ట్ అవసరం ఏముంటుంది? రెస్ట్ ఇస్తే గాయాలయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుందనేది అర్థం లేని వాదన... ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడి, సిరీస్‌లకు దూరమైన వాళ్లు లేరా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ..