MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2022: సన్ రైజర్స్ కు బిగ్ షాక్.. కీలక ఆటగాడికి గాయం.. తర్వాత మ్యాచులకు డౌటే..

IPL 2022: సన్ రైజర్స్ కు బిగ్ షాక్.. కీలక ఆటగాడికి గాయం.. తర్వాత మ్యాచులకు డౌటే..

TATA IPL 2022: ఐపీఎల్ లో వరుసగా రెండు మ్యాచులు గెలిచి ముందుకు సాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్  కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ కు గాయమైంది. 

2 Min read
Author : Srinivas M
Published : Apr 12 2022, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐపీఎల్-2022  సీజన్ ను ఓటములతో మొదలుపెట్టి తర్వాత రెండు వరుస విజయాలతో గాడిలో పడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ కు భారీ షాక్ తగిలింది. తన స్పిన్ తో  ప్రత్యర్థులను కట్టడి చేయడంతో పాటు బ్యాటింగ్ లో కూడా విలువైన పరుగులు సాధిస్తున్న ఆ జట్టు ఆటగాడు వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సోమవారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ సందర్భంగా సుందర్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని టీమ్ హెడ్ కోచ్ టామ్ మూడీ వెల్లడించాడు. గాయం కారణంగా అతడు పలు  మ్యాచులకు అందుబాటులో ఉండడని కూడా మూడీ పేర్కొన్నాడు. 

37

మూడీ మాట్లాడుతూ.. ‘వాషింగ్టన్  సుందర్ కుడి చేతి బొటనవేలు, మొదటి వేలుకు మధ్య చీలిక వచ్చింది.  గాయం తీవ్రత ఎలా ఉంటుందో ఇంకా చెప్పలేం. అయితే  రాబోయే వారం రోజుల పాటు అతడికి విశ్రాంతి అవసరం. ఎస్ఆర్హెచ్ ఆడబోయే  తదుపరి రెండు మ్యాచులకు అతడు అందుబాటులో ఉండటం అనుమానమే..’ అని తెలిపాడు. 

47

సీజన్ లో ఓపెనింగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఆడిన సన్ రైజర్స్  61 పరుగుల తేడాతో ఓడగా.. రెండో మ్యాచులో లక్నో చేతిలో 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక చెన్నైతో  జరిగిన మూడో మ్యాచులో నెగ్గి విజయాల బాట పట్టిన ఆరెంజ్ ఆర్మీ.. సోమవారం  ఈ సీజన్ లో ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న గుజరాత్ కు ఓటమి రుచి చూపించింది. 
 

57

రాజస్థాన్ తో మ్యాచులో 3 వికెట్లు తీసుకున్న  వాషింగ్టన్ సుందర్.. తర్వాత మూడు మ్యాచులలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక గుజరాత్ తో జరిగిన  మ్యాచులో  3 ఓవర్లు వేసి 14 పరుగులే ఇచ్చాడు. వికెట్లేమీ తీయకున్నా..  పొదుపుగా బౌలింగ్ చేసి గుజరాత్ ను కట్టడి చేశాడు. 
 

67

ఇదిలాఉండగా... ఈ సీజన్ లో సన్ రైజర్స్ తర్వాత ఈనెల 15న కోల్కతా నైట్ రైడర్స్ ను ఢీకొనబోతుంది.   అనంతరం ఏప్రిల్ 17న పంజాబ్ తో ఆడనుంది. ఈ రెండు మ్యాచులకు వాషింగ్టన్ ఆడేది అనుమానమే. 

77

వాషింగ్టన్ స్థానంలో శ్రేయస్ గోపాల్ గానీ, జగదీష్ సుచిత్ ను గానీ తుది జట్టులోకి తీసుకునే ఛాన్సుంది.  ఇక ఇప్పటికే జట్టులో ఉన్న అబ్దుల్ సమద్, ఏయిడెన్ మార్క్రమ్ లు  కూడా  బౌలింగ్ చేయగలరు. మరి సన్ రైజర్స్ సారథి కేన్ మామ ఎవరితో  వెళ్తాడో  వేచి చూడాలి. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image3
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved