MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • త్రీడీ శంకరన్నా... నీ లక్ చూస్తే జెలసీగా ఉందే! సురేష్ రైనాని కాదని నిన్ను కొన్నారంటే...

త్రీడీ శంకరన్నా... నీ లక్ చూస్తే జెలసీగా ఉందే! సురేష్ రైనాని కాదని నిన్ను కొన్నారంటే...

విజయ్ శంకర్... ఈ పేరు చెప్పగానే చాలా మందికి అంబటి రాయుడు గుర్తుకు వస్తాడు. 2019 వన్డే వరల్డ్ కప్ జట్టులో అంబటి రాయుడిని కాదని విజయ్ శంకర్‌ని ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అప్పటి ఛీఫ్ సెలక్టర్ ‘త్రీడీ ప్లేయర్’ అంటూ శంకర్‌ని పొగడడం మరింత వైరల్ అయ్యింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 15 2022, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

వన్డే వరల్డ్ కప్ 2019 మ్యాచులను చూసేందుకు ‘త్రీడీ గ్లాసెస్’ ఆర్డర్ చేశానంటూ అంబటి రాయుడు ట్వీట్ వేయడం, భారత జట్టు సెమీస్‌లో ఓడి ఇంటిదారి పట్టడంతో విజయ్ శంకర్... బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

2019 వన్డే వరల్డ్ కప్‌లో వేసిన మొట్టమొదటి బంతికే వికెట్ తీసిన విజయ్ శంకర్, ప్రాక్టీస్ సెషన్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో గాయపడి జట్టుకి దూరమయ్యాడు...

39

భారత జట్టుకి ఆడిన దానికంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్‌గా కూడా విజయ్ శంకర్... బీభత్సమైన పాపులారిటీ తెచ్చుకున్నాడు. చేతుల్లోకి వచ్చిన మ్యాచులను చేజేతులా ఓడగొట్టడం శంకరన్న స్పెషాలిటీ... అంటూ తీవ్రంగా ట్రోల్ చేసేవాళ్లు సన్‌రైజర్స్ ఫ్యాన్స్...

49

ట్రోలింగ్‌కి తగ్గట్టుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో విజయ్ శంకర్ ఆటతీరు నడిచింది. విజయ్ శంకర్ తన పర్ఫామెన్స్‌తో సన్‌రైజర్స్‌ని గెలిపించిన మ్యాచులు వెతికితే కానీ, అక్కడో ఇక్కడో ఒకటీ ఆరా దొరకవు..
 

59

అలాంటి విజయ్ శంకర్‌ని గుజరాత్ టైటాన్స్ వేలంలో రూ.1.4 కోట్లకు కొనుగోలు చేసింది. గత రెండు మ్యాచుల్లో ఆకట్టుకున్న సాయి సుదర్శన్‌ని తప్పించి, రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో విజయ్ శంకర్‌కి చోటు ఇచ్చాడు హార్ధిక్ పాండ్యా...

69

అయితే గత మ్యాచ్‌లో 7 బంతులాడి 2 పరుగులకి అవుట్ అయ్యాడు విజయ్ శంకర్. మొత్తంగా ఈ సీజన్‌లో 3 మ్యాచులు ఆడిన విజయ్ శంకర్, 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అత్యధిక స్కోరు 13 పరుగులు...

79

విజయ్ శంకర్‌ ట్రాక్ రికార్డు చూసి కూడా అతన్ని కొనుగోలు చేసిన ఫ్రాంఛైజీలు, ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా, అమిత్ మిశ్రా, పియూష్ చావ్లా వంటి సీనియర్లను కొనుగోలు చేయకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్...

89

మూడు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనాని కొనుగోలు చేయడానికి ఇష్టపడని చెన్నై సూపర్ కింగ్స్, విజయ్ శంకర్ కోసం రూ.కోటీ 30 లక్షల వరకూ బిడ్ వేయడం కొసమెరుపు... 

99

విజయ్ శంకర్‌కి ఉన్న లక్‌లో సగం ఉన్నా జీవితంలో ఎంతో సాధించేవాళ్లమని, భారత జట్టులో కెప్టెన్‌గా కొనసాగేవాళ్లమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు... 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image2
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image3
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved