MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టీమిండియాకి ఆడలేకపోయాడు కానీ! ఇండియాపై ఆడేందుకు రెఢీ... యూఎస్ఏ టీమ్‌లో ఉన్ముక్త్ చంద్...

టీమిండియాకి ఆడలేకపోయాడు కానీ! ఇండియాపై ఆడేందుకు రెఢీ... యూఎస్ఏ టీమ్‌లో ఉన్ముక్త్ చంద్...

ఉన్ముక్త్ చంద్... 2014 అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన భారత యువ జట్టు సారథి. టీమిండియా తరుపున కచ్ఛితంగా ఆడతాడని, ఎంట్రీకి ముందే భారీ అంచనాలు మోసిన ఈ క్రికెటర్, అనుకున్నట్టుగా కెరీర్‌లో సక్సెస్ సాధించలేకపోయాడు...

Chinthakindhi Ramu | Published : Apr 12 2022, 03:20 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Unmukt Chand

Unmukt Chand

ఐపీఎల్‌లో, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన ఉన్ముక్త్ చంద్, క్రికెటర్‌గా ఎదగకముందే వచ్చిన క్రేజ్‌ కారణంగా ఆటపై దృష్టి పెట్టలేకపోయాడు...

28
Asianet Image

8 ఏళ్ల పాటు భారత జట్టులో అవకాశాల కోసం ఆశగా ఎదురుచూసిన ఉన్ముక్త్ చంద్, 2021లో టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు...

38
Asianet Image

యూఎస్ఏకి మకాం మార్చిన ఉన్ముక్త్ చంద్, మైనర్ లీగ్‌ క్రికెట్‌లో పాల్గొన్న ఉన్ముక్త్ చంద్, 2021 సీజన్‌లో 612 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు..

48
Asianet Image

బిగ్‌ బాష్ లీగ్ 2022లో పాల్గొన్న మొట్టమొదటి భారత పురుష క్రికెటర్‌గా నిలిచిన ఉన్ముక్త్ చంద్, మెల్‌బోర్న్ రెనెగాడ్స్ జట్టు తరుపున కొన్ని మ్యాచులు ఆడాడు...

58
Asianet Image

క్రికెట్‌కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చేందుకు వీలుగా ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీని వెస్టిండీస్‌తో పాటు యూఎస్‌ఏలోనూ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది...

68
Asianet Image

టీ20 వరల్డ్ కప్ 2024కి యూఎస్‌ఏ ఆతిథ్యం ఇవ్వబోతుండడంతో హోస్ట్ కంట్రీగా ఆటోమేటిక్‌గా ఆ టోర్నీకి అర్హత సాధించింది అమెరికా... ఈ నిర్ణయంతో యూఎస్‌ఏ తరుపున ఆడుతున్న ఉన్ముక్త్ చంద్, టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో పాల్గొనబోతున్నాడు...

78
Asianet Image

ఉన్ముక్త్ చంద్‌తో పాటు మాజీ న్యూజిలాండ్ క్రికెటర్ కోరీ అండర్సన్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు కొందరు తమ సొంత దేశాలకు ప్రత్యర్థులుగా బరిలో దిగబోతున్నారు. 

88
Asianet Image

అండర్ 19 వరల్డ్ కప్ 2014 విజయం తర్వాత టీమిండియా తరుపున ఆడాలని కలలు కన్న ఉన్ముక్త్ చంద్, పదేళ్ల తర్వాత సొంత జట్టుకి ప్రత్యర్థిగా ఆడబోతుండడం విశేషం... 

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu
 
Recommended Stories
Top Stories