MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • బాబర్‌కి అంత సీన్ లేదు, విరాట్ కోహ్లీ తర్వాతే ఎవ్వరైనా... షేన్ వాట్సన్ టాప్ 5 బ్యాటర్లు వీరే...

బాబర్‌కి అంత సీన్ లేదు, విరాట్ కోహ్లీ తర్వాతే ఎవ్వరైనా... షేన్ వాట్సన్ టాప్ 5 బ్యాటర్లు వీరే...

ఒకటి, రెండేళ్ల పాటు సూపర్ ఫామ్‌లో ఉంటే చాలు... విరాట్ కోహ్లీతో సమానంగా, లేదా అతనికంటే తోపు అంటూ చెప్పడం క్రికెట్ ఫ్యాన్స్‌కి అలవాటుగా మారిపోయింది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సీఎస్‌కే మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్... ప్రస్తుత తరంలో టాప్ 5 ప్లేయర్ల గురించి చెప్పుకొచ్చాడు..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 14 2022, 05:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఫార్మాట్లతో సంబంధం లేకుండా గత దశాబ్దంలో పరుగుల వరద పారించాడు విరాట్ కోహ్లీ. పదేళ్లలో 20 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర క్రియేట్ చేసి... ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

రెండేళ్ల నుంచి సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నా విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి పరుగుల ప్రవాహం మాత్రం ఆగడం లేదు. గత రెండేళ్లల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా ఉన్నాడు కోహ్లీ...

311
Image Credit: Getty Images

Image Credit: Getty Images

ప్రస్తుత తరంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్... విరాట్ కోహ్లీతో కలిసి నెం.1 టెస్టు బ్యాట్స్‌మెన్ పొజిషన్ కోసం పోటీపడుతున్నారు...

411

‘టెస్టు క్రికెట్‌లో ఎప్పుడూ విరాట్ కోహ్లీయే నెం.1... అతను దాదాపు ఓ సూపర్ హ్యూమన్. విరాట్ కోహ్లీ క్రీజులో ఉంటే చాలు, ఓ హై ఓల్టేజ్ ఎనర్జీ నిండి ఉంటుంది...

511

బాబర్ ఆజమ్ కూడా విరాట్ కోహ్లీ తర్వాతే. బాబర్ ఆజమ్ బాగా ఆడుతున్నాడు. అతను టెస్టు ఫార్మాట్‌ను అలవరుచుకున్న విధానం అద్భుతం...

611

అయితే అతను లెజెండ్‌గా మారడానికి ఇంకా సమయం ఉంది. నా దృష్టిలో బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లీ తర్వాతి పొజిషన్‌లోనే ఉంటాడు...

711

స్టీవ్ స్మిత్ ప్రారంభంలో అద్భుతంగా ఆడేవాడు. అయితే ఇప్పుడు అతను బౌలర్లపై పెద్దగా ఒత్తిడి పెంచలేకపోతున్నాడు...

811

ప్రారంభంలో స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీతో పోటీపడ్డాడు. అతను విరాట్ చూపించిన నిలకడ, స్మిత్ బ్యాటింగ్‌లో కొరవడింది. నా దృష్టిలో స్టీవ్ స్మిత్ టాప్ 3లో ఉంటాడు...

911

కేన్ విలియంసన్‌కి కొన్ని శారీరక సమస్యలు ఉన్నాయి. అతని మోకాలి గాయం చాలా ఇబ్బంది పెడుతోంది. అయితే కేన్ విలియంసన్ ఫిట్‌గా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా క్రీజులో పాతుకుపోయి బౌలర్లను విసిగించగలడు...

1011
Joe Root

Joe Root

జో రూట్ ఎన్ని సెంచరీలు చేసినా... స్టీవ్ స్మిత్‌లాగే లైన్ లోకి రావడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఇంతకుముందు అతను భారీ స్కోర్లు చేయకపోయినా మంచి ఇన్నింగ్స్‌లే ఆడేవాడు...

1111

సెంచరీ అనేది మ్యాచ్‌ని గెలిపించకపోతే దేనికీ పనికి రాదని నా ఉద్దేశం. విరాట్ కోహ్లీ చేసే 70-80 పరుగులు కూడా మ్యాచ్ రిజల్ట్‌నే మార్చేయగలవు. అందుకే విరాట్ ఎప్పుడూ మిగిలిన ప్లేయర్ల కంటే ముందుంటాడు...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్... 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image2
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image3
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved