MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • వాళ్లిద్దరూ కింద ఉండడమే మంచిది, ఎన్నిసార్లని టైటిల్స్ గెలుస్తారు.. - వీరేంద్ర సెహ్వాగ్

వాళ్లిద్దరూ కింద ఉండడమే మంచిది, ఎన్నిసార్లని టైటిల్స్ గెలుస్తారు.. - వీరేంద్ర సెహ్వాగ్

ఐపీఎల్ ఇప్పటికి 14 సీజన్లు ముగిస్తే, అందులో 9 టైటిల్స్ కేవలం రెండు జట్ల దగ్గరే ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఐదు సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు టైటిల్స్ గెలిచాయి. అయితే ఈసారి ఈ రెండు జట్లూ వరుస ఓటములను చవిచూస్తున్నాయి...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 14 2022, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగు పరాజయాల తర్వాత తొలి విజయాన్ని అందుకోగా, ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంలో పడేసుకుంది...

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

గత సీజన్‌లో వరుస పరాజయాలను అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడినా, ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది...

39
Jasprit Bumrah

Jasprit Bumrah

వచ్చే సీజన్‌లో అందుబాటులో ఉండే జోఫ్రా ఆర్చర్‌పై భారీ ఖర్చు చేసిన ముంబై ఇండియన్స్, ఈ సీజన్‌పై పెద్దగా ఫోకస్ పెట్టనట్టే కనిపిస్తుంటే, దీపక్ చాహార్ గాయంతో తప్పుకోవడం చెన్నైని తీవ్రంగా దెబ్బ తీసింది...

49

ఈ రెండు జట్లూ కూడా ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొదటి రోజు కేవలం నలుగురు ప్లేయర్లను మాత్రమే కొనుగోలు చేయడం విశేషం...

59

రెండో రోజు స్పీడ్ పెంచి, దొరికిన ప్లేయర్లను దొరికిన కాడికి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్... భారీ మూల్యం చెల్లించుకోబోతున్నట్టే కనిపిస్తోంది...

69

‘నేను ఇంతకుముందు కూడా చెప్పా. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి సక్సెస్‌ఫుల్ టీమ్స్ బాటమ్‌లో ఉండడం చాలా మంచిది... వాళ్లు అక్కడుంటేనే బాగుంటుంది...

79

ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌నే చూసుకుంటే... 190 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదిస్తున్నప్పుడు రెండు రనౌట్లు పడితే, తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చి గెలవడం చాలా కష్టం...

89

సూర్యకుమార్ యాదవ్‌కి ఆఖరి ఓవర్‌ ఓడియన్ స్మిత్ కానీ లేదా లియామ్ లివింగ్‌స్టోన్ కానీ బౌలింగ్ చేస్తాడని తెలియకపోవచ్చు. కాబట్టి ఆఖరి ఓవర్‌కి ముందే కావాల్సినన్ని పరుగులు చేయాలని ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

99

ముంబై, సీఎస్‌కే కాస్త విశ్రాంతి తీసుకుంటే ఈ సారి కొత్త ఛాంపియన్‌ని చూసేందుకు ఛాన్స్ ఉంటుంది. ప్రతీసారి ఆ ఇద్దరే గెలిస్తే పరమ రోటీన్‌గా,. బోరింగ్‌గా మారుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్... 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image2
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image3
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved