- Home
- Sports
- Cricket
- పరాయి మగాడితో లిప్ లాక్.. బుమ్రాతో పెళ్లికి ముందే డేటింగ్.. సంజనా గణేషన్ గురించి ఈ విషయాలు తెలుసా?
పరాయి మగాడితో లిప్ లాక్.. బుమ్రాతో పెళ్లికి ముందే డేటింగ్.. సంజనా గణేషన్ గురించి ఈ విషయాలు తెలుసా?
Sanjana Ganesan: క్రికెట్ ప్రెజెంటర్ గా యాంకర్ గా అభిమానులను విశేషంగా అలరిస్తున్నది ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్. అయితే బుమ్రాతో పెళ్లికి ముందే ఈ హఆట్ యాంకర్ మరో వ్యక్తితో...

టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. సంజనా గణేషన్ ను 2021 మార్చి 15న అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఫూణేలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే సంజనా పలు ఒక వ్యక్తికి అందరూ చూస్తుండగానే లిప్ లాక్ కూడా ఇచ్చింది.
ఓ టీవీ షోలో భాగంగా ఇలా చేసిన సంజనా గణేషన్ కు సంబంధించి ఎవరికీ తెలియని ఐదు ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
1. ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్టు : అవును సంజనా గణేశన్ మిస్ ఇండియా అందాల పోటీల ఫైనల్స్ వరకు వెళ్లింది. 2014లో ఆమె మిస్ ఇండియా పోటీలలో ఎంపికైన 24 మంది ఫైనలిస్టులలో ఆమె కూడా ఉంది. కానీ చివరికి కోయల్ రాణా కు కిరీటం దక్కింది.
2. ఎంటీవీలో ఫస్ట్ టీవీ షో : మిస్ ఇండియా ఫైనలిస్టు నుంచి తిరిగొచ్చాక ఈ అమ్మడు.. 2014లో ఎంటీవీ వాళ్ల ప్రఖ్యాత టీవీ షో స్ప్లిట్స్ విల్లా లో యాంకర్ గా చేసింది.
3. అశ్విని కౌల్ తో కిస్ : ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా షోలో తన కో కంటెస్టెంట్ అశ్విన్ కౌల్ తో సంజనా ప్రేమాయణం నడిపింది. ఇద్దరూ కలిసి డేటింగ్ చేశారు. ఈ షో సందర్భంగా సంజనా.. కౌల్ కు లిప్ లాక్ కూడా ఇచ్చింది. అయితే స్ప్లిట్స్ విల్లా షో లో గాయమై ఆమె షో నుంచి అర్థాంతరంగా వైదొలగింది. అదే ఆమె కెరీర్ ను మలుపుతిప్పింది.
4 కేకేఆర్ కు ఫ్యాన్ : స్టార్ స్పోర్ట్స్ కు రాకముందు సంజనా కోల్కతా నైట్ రైడర్స్ కు చెందిన పలువురు ఆటగాళ్లు, అభిమానులు, ఆ జట్టు ఓనర్ షారుఖ్ ఖాన్ తో కలిసి ఓ షో చేసింది. ఆ షో పాపులర్ అవడంతో సంజనాకు స్టార్ స్పోర్ట్స్ లో అవకాశం వచ్చింది.
కేకేఆర్ తో వచ్చిన ఈ అవకాశానికి గాను ఆమె ఆ జట్టుకు వీరాభిమానిగా మారింది. గతంలో పలుమార్లు ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. అయితే బుమ్రా తో రిలేషన్ షిప్ స్టార్టయి అతడిని పెళ్లి చేసుకున్నాక సంజనా ముంబై ఇండియన్స్ కూడా ఇష్టపడుతున్నది.
5. 2019 ఐసీసీ ప్రపంచకప్ కు యాంకర్ : 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఆమె స్టార్ స్పోర్ట్స్ లో ప్రెజెంటర్ గా పనిచేసింది. ఇంగ్లాండ్ లో జరిగిన ఈ ఈవెంట్ ను అద్భుతంగా కవర్ చేసింది. అంతేగాక సంజనా ఇటీవలే న్యూజిలాండ్ లో ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ ను కూడా కవర్ చేసింది.