గూగుల్ లేఅఫ్స్ 2025: హైదరాబాద్, బెంగళూరులో భారీగా ఉద్యోగాలు ఊడినట్టేనా?
Google layoffs 2025: గూగుల్ గ్లోబల్ లేఅఫ్స్ నేపథ్యంలో భారత్‌లోని ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగాలపై కూడా ప్రభావం పడనుంది. హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లోని ప్రకటన, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఊడుతాయని సమాచారం. 2025 జనవరిలో వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ తర్వాత గూగుల్ లో కొనసాగుతున్న రీస్ట్రక్చరింగ్ ఇది.

Google layoffs 2025: టెక్ దిగ్గజం గూగుల్ గ్లోబల్ తొలగింపుల రిపోర్టుల మధ్య భారత్ పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ తాజాగా ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైసెస్ విభాగం నుంచి వందలాది ఉద్యోగాలను తొలగించిన నేపథ్యంలో ఇప్పుడు భారత్‌లోని హైదరాబాద్, బెంగళూరు కార్యాలయాల్లో కూడా చాలా మార్పులకు సిద్ధమవుతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా యాడ్, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశముందని బిజినెస్ స్టాండర్స్ నివేదిక పేర్కొంది.

Google India Restructuring: What It Means for Jobs in Bengaluru & Hyderabad
గూగుల్ ఇంటర్నల్ మార్పులతో పాటు స్వచ్ఛంద పదవీ విరమణలు
2025 జనవరిలో గూగుల్ వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అలాగే, కొన్ని రోల్స్ ను కూడా తొలగించింది. ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైసెస్ టీమ్‌లను కలిపినప్పటి నుంచి తాము మరింత మెరుగైన, సమర్థవంతంగా పనిచేసేందుకు కృషి చేస్తున్నామనీ, ఇందులో కొంతమంది ఉద్యోగులను తొలగించడమూ కూడా భాగంగా ఉందని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Tech Layoffs Continue: Google to Reorganize Teams in India Amid Global Cuts
ఇంజనీరింగ్ ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు
భారతదేశంలోని ఇంజనీరింగ్ ఉద్యోగులకు సంబంధించి, లేఅఫ్స్ చేయకుండా వారిని రెవెన్యూ ఆధారిత ప్రాజెక్టులవైపు మళ్లించే యోచనలో కూడా గూగుల్ ఉందని సమాచారం. అయితే ప్రకటన, మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో కొన్ని రోల్స్ తొలగించే అవకాశం ఉంది.

Will Google Fire Employees in India? Restructuring Plans Unveiled
గూగుల్ గ్లోబల్ లేఆఫ్స్ ప్రభావం
గూగుల్ గ్లోబల్ లేఆఫ్స్ కారణంగా చాలా ప్రాంతాల్లో ఉద్యోగులపై ప్రభావం పడింది. అయితే, ఇండియాలో తక్కువ ప్రభావం ఉంటుందని కూడా సమాచారం. కానీ యూఎస్, యూకే, యూరోప్ ప్రాంతాల్లో అయితే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది.
2023లో గూగుల్ దాదాపు 12,000 ఉద్యోగాలను తొలగించింది, ఇది మొత్తం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 6 శాతం. ఇప్పుడు కొనసాగుతున్న లేఅఫ్స్ అదే వ్యూహానికి కొనసాగింపుగా చెప్పవచ్చు. కానీ, ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్, బెంగళూరులో గూగుల్ లేఆఫ్స్ ప్రభావం తక్కువగానే ఉండనుంది.

Hyderabad & Bengaluru Google Jobs at Risk? Here’s the Full Update
2025లో టెక్ ఉద్యోగాలపై దెబ్బ
మొత్తంగా 2025 ఏడాది టెక్ సంస్థల పురోగతిపై తీవ్రంగానే ప్రభావం చూపుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. Layoffs.fyi నివేదికల ప్రకారం.. లేఅఫ్స్ లు గమనిస్తే 2025లో ఇప్పటివరకు 93 కంపెనీలు 23,500 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. 2024లో మొత్తం 152,499 టెక్ ఉద్యోగాలు ఊడాయి.