- Home
- Business
- FASTag: టోల్‌గేట్ వద్ద 10 సెకండ్స్ రూల్ గురించి మీకు తెలుసా? టైమ్, మనీ రెండూ సేవ్ చేయొచ్చు
FASTag: టోల్‌గేట్ వద్ద 10 సెకండ్స్ రూల్ గురించి మీకు తెలుసా? టైమ్, మనీ రెండూ సేవ్ చేయొచ్చు
FASTag: టోల్ గేట్ల వద్ద కొత్తగా అమలవుతున్న 10 సెకన్ల రూల్ గురించి మీకు తెలుసా? ఈ రూల్ టోల్ గేట్ సిబ్బంది, కారు నడిపేవారు ఇద్దరూ ఫాలో అయితేనే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. ఈ 10 సెకన్ల రూల్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఫాస్టాగ్ వినియోగదారుల కోసం కొత్త రూల్
ఫాస్టాగ్ వినియోగించే వారి కోసం "10 సెకన్ల నిబంధన" కొత్తగా అమలులోకి వచ్చింది. దీని గురించి చాలా మందికి తెలియదు. మీరు గమనించి ఉంటే ఈ మధ్య టోల్ గేట్ల వద్ద వాహనాలు ఎక్కువ సేపు నిలబడకుండా వేగంగా వెళ్లిపోతున్నాయి. ఇదంతా ఫాస్టాగ్ వల్ల అని చాలా మంది అనుకుంటున్నారు. కాని 10 సెకన్ల లోపు వాహనాలు టోల్ గేట్ దాటాలన్న కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధన వల్లే వాహనాలు ఆగకుండా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
10 సెకన్ల రూల్ అంటే ఏమిటి?
ఈ నిబంధన ప్రకారం FASTag అమర్చిన వాహనాలు టోల్ ప్లాజాల్లో 10 సెకన్లలోపే FASTag లేన్ ద్వారా గేట్ దాటి వెళ్లాలి. దీని ద్వారా వాహనాలు నిలిచిపోకుండా ఉంటాయి. ట్రాఫిక్‌ను నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.
ఇది ఎలా పనిచేస్తుంది?
ప్రతి టోల్ ప్లాజాలో ప్రత్యేకంగా RFID రీడర్లు అమర్చిన లేన్లు ఉంటాయి. వాహనం దగ్గరికి వచ్చిన వెంటనే ఫాస్టాగ్‌ను గుర్తించి, వాస్తవ సమయంలో (Real-time) ఖాతా నుండి చార్జ్ కట్ చేస్తారు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థ కావడం వల్ల వేగంగా గేట్ తెరుచుకుంటుంది.
10 సెకన్ల సమయం దాటితే ఏం చేయొచ్చు..
మీకు ఫాస్టాగ్ ఉండి, సెన్సార్ మీ కారును గుర్తించడానికి 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే మీరు ముందుకు వెళ్లిపోవచ్చు. టోల్ సిబ్బందికి చెప్పి గేట్ ఓపెన్ చేయించుకొని మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లిపోవచ్చు. కాని గుర్తుపెట్టుకోండి. మీ సైడ్ నుంచి ఎటువంటి సమస్య ఉండకూడదు. అంటే ఫాస్టాగ్ సరిగ్గా పనిచేయాలి. అందులో బ్యాలెన్స్ సరిపడా ఉండాలి. ఒకవేళ టోల్ గేట్ తరఫున సమస్య వస్తే, 10 సెకన్ల కంటే ఎక్కువ సేపు మీరు వేచి ఉంటే ఆ తర్వాత మీరు ఆగకుండా వెళ్లిపోవచ్చు.
10 సెకన్ల రూల్ వల్ల ఉపయోగాలు
10 సెకన్ల రూల్ వల్ల టోల్ ప్లాజాల్లో వాహనాల ఎక్కువసేపు ఆగకుండా వేగంగా గేట్ దాటేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్ కొన్ని సెకన్లలోనే పూర్తవుతుంది. ప్రయాణికుల ప్రయాణం కూడా సాఫీగా సాగుతుంది.
ఫాస్టాగ్ వల్ల డిజిటల్ పేమెంట్స్ వేగంగా, పారదర్శకంగా జరుగుతాయి.