Home Loan: మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి
మీరు హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ముందుగా మీరు చాలా విషయాలపై అవగాహన పెంచుకోవాలి. కొన్ని విషయాలు తెలుసుకొని తర్వాత హోమ్ లోన్ కి వెళ్లాలి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
బ్యాంకుల్లో వడ్డీ రేట్లు చెక్ చేయండి
ఇల్లు కొనాలని లేదా కట్టాలని మీరు డిసైడ్ అయితే ముందుగా మీరు బ్యాంకుల్లో వడ్డీ రేటును పరిశీలించుకోవాలి. ఏ బ్యాంకు ఎంత ఇంటరెస్ట్ రేట్ ఇస్తుందో చెక్ చేసుకోవాలి. ఈ వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మీరు ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు ఎంత ఉందో చెక్ చేసుకొని, మరీ ఎక్కువగా ఉండే కొన్ని రోజులు ఆగి లోన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే 0.5 శాతం వడ్డీ పెరిగినా లాంగ్ టర్మ్ లో రూ.లక్షల్లో భారం పడుతుంది.
కండీషన్స్, ఫీజులు సరిగ్గా చూసుకోండి
హోమ్ లోన్ తీసుకొనేటప్పుడు బ్యాంకులు చాలా కండీషన్స్ పెడతాయి. అదే విధంగా వివిధ రకాల ఫీజులు కూడా విధిస్తాయి. వాటన్నిటి గురించి వివరంగా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఏ రూల్ మీరు తెలుసుకోకుండా సంతకం పెట్టినా తర్వాత జరిగే పరిణామాలకు మీదే బాధ్యత అవుతుంది. బ్యాంకులు సహాయం చేయవు. ఉదాహరణకు వడ్డీరేట్లలో మార్పుల గురించి అగ్రిమెంట్ లో ముందే బ్యాంకులు తెలియజేస్తాయి. కాని వాటిని చదవకుండా, అనుమానులు ఉంటే తీర్చుకోకుండా సంతకాలు పెడితే తర్వాత బ్యాంకులు బాధ్యత వహించవు.
ముందుగా సిబిల్ ఎంతుందో చెక్ చేసుకోండి
ఏ లోన్ ఇవ్వాలన్నా బ్యాంకులు అభ్యర్థుల సిబిల్ ని చెక్ చేస్తాయి. మీరు కూడా హోమ్ లోన్ తీసుకొనే ముందు మీ సిబిల్ స్కోర్ ఎంతుందో ముందే చెక్ చేసుకోండి. మీ సిబిల్ ని బట్టి మీకు లోన్ వస్తుందో రాదో మీకే అర్థమైపోతుంది. ప్రభుత్వ బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఒకరకమైన సిబిల్, ప్రైవేటు బ్యాంకుల్లో లోన్ పొందడానికి ఒక రకమైన సిబిల్ లిమిటేషన్స్ ఉంటాయి. మీకు సిబిల్ మరీ తక్కువగా ఉంటే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు ముందుకొస్తాయి. కాని వడ్డీరేట్లు అధికంగా విధిస్తాయి.
మీ ఆదాయం, ఖర్చులు చూసుకోండి
సాధారణంగా బ్యాంకులు హోమ్ లోన్ అనే సరికి ప్రాపర్టీ వాల్యూను చూసి, యజమాని ఆదాయాన్ని పరిగణించి లోన్స్ ఓకే చేస్తాయి. ఇల్లు కొనడానికి లేదా కట్టడానికి మీ దగ్గర ఎంత సేవింగ్స్ ఉన్నాయి? ఎంత లోన్ తీసుకోవాలన్న విషయంపై ముందే క్లారిటీకి రండి. ఎందుకంటే కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ప్రాపర్టీ వాల్యూ చూసి ఎంతైనా లోన్ ఇచ్చేస్తాయి. అవి తీర్చలేకపోతే యజమాని ఇల్లు తీసేసుకుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మీ ఆదాయ వ్యయాల గురించి ముందే క్లారిటీ తెచ్చుకోండి.
ఆఫర్స్ ఇచ్చినప్పుడు కొనుక్కోవడం బెటర్
సాధారణంగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు పండగల సమయంలో ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంటాయి. ఎక్కువ టెన్యూర్, తక్కువ వడ్డీతో లోన్స్ ఇస్తుంటాయి. మీరు ఇల్లు కొనడం లేదా కట్టడం అంత అర్జెంట్ కాకపోతే పండగల సమయంలో హోమ్ లోన్ కి వెళ్లడం బెటర్. తక్కువ వడ్డీకి లోన్ లభిస్తుంది. కాని కండీషన్స్ అన్నీ క్లియర్ గా చదువుకొని ముందుకెళ్లడం బెటర్. ఎందుకంటే పండగ సీజన్ లో వడ్డీ తగ్గించినా తర్వాత మారుస్తామని కండీషన్స్ లో ఉండే అవకాశం ఉంటుంది.
హోల్ లోన్ తీసుకొనే ముందు అన్ని విధాలుగా మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకసారి లోన్ లోకి దిగాక మళ్లీ వెనక్కు తగ్గడం అంత ఈజీ కాదు.