MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Automobile
  • EV Car : ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

EV Car : ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) వైపు చాలామంది చూస్తున్నారు. అయితే ఈవీ కారు కొనేముందు లాభనష్టాలు కాదు కొన్ని ముఖ్యమైన ప్రాక్టికల్ విషయాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 28 2026, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెట్రోల్ కంటే ఈవి కారు చాలా బెటరా?
Image Credit : tata motors

పెట్రోల్ కంటే ఈవి కారు చాలా బెటరా?

పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ (EV) కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంధన ఖర్చు చాలా తగ్గుతుంది… అంటే ప్రతి ప్రయాణంలోనూ డబ్బులు ఆదా అవుతాయి. కాబట్టి ఈ వాహనాల కోసం ప్రారంభంలో ఎక్కువ డబ్బులు పెట్టినా పోనుపోను డబ్బులు ఆదా చేయవచ్చు.

ఇక పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రెండ్లీ మెయింటెనెన్స్ ఈవీ వాహనాలు బెస్ట్ ఆప్షన్ గా మారాయి. ఇంట్లో ఛార్జ్ చేస్తే చాలు… మార్గమధ్యలో పెట్రోల్ బంక్ వద్ద ఆగాల్సిన పని ఉండదు… అంటే ఖర్చు ఉండదు. ఒక కిలోమీటర్ ప్రయాణానికి అయ్యే కరెంట్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు కంటే చాలా తక్కువగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈవి కార్లకు లో మెయింటెనెన్స్
Image Credit : carnewschina.com

ఈవి కార్లకు లో మెయింటెనెన్స్

ప్రతిరోజూ ప్రయాణాలు చేసేవారికి ఈవీ కార్లు చాలా ఉపయోగపడతాయి. పెట్రోల్, డీజిల్ కార్లలో ఉండే ఇంజిన్, స్పార్క్ ప్లగ్, ఇంజిన్ ఆయిల్ వంటి చాలా భాగాలు ఎలక్ట్రిక్ కార్లలో ఉండవు. కాబట్టి రెగ్యులర్ మెయింటెనెన్స్ అవసరం లేదు. ఇలా విడిభాగాలు తక్కువగా ఉండటం వల్ల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది… మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గి డబ్బులు ఆదా అవుతాయి.

Related Articles

Related image1
EV Car: 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌.. ఏకంగా 1100కిలో మీట‌ర్ల మైలేజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ కారు
Related image2
Tata EV Discounts: టాటా ఈవీ కార్లపై రూ.3.35 లక్షల వరకు తగ్గింపు ఆఫర్లు.. డోంట్ మిస్ !
35
ఈవి కార్లతో నో పొల్యూషన్
Image Credit : carnewschina.com

ఈవి కార్లతో నో పొల్యూషన్

ఎలక్ట్రిక్ కార్లు వెంటనే టార్క్ అందిస్తాయి, కాబట్టి కారు వేగంగా దూసుకెళ్తుంది. కానీ పెట్రోల్, డీజిల్ కార్లు ఇంజిన్‌తో నడుస్తాయి కాబట్టి ఈవీల కంటే శబ్దం, వైబ్రేషన్ ఎక్కువగా ఉంటాయి. ఈవీ కార్ల నుంచి పొగ రాదు కాబట్టి వాయు కాలుష్యం తగ్గుతుంది.

అయితే ఈవీ కారు కొనేముందు మీ ఇంట్లో పార్కింగ్, కరెంట్ కనెక్షన్, హోమ్ ఛార్జర్ ఏర్పాటు చేసుకునే సౌకర్యం ఉందో లేదో చూసుకోండి. ఇవి ఉంటేనే ఎలక్ట్రిక్ కారు కొనడం మంచిది… లేదంటే ఇబ్బందిపడాల్సి ఉంటుంది.

45
ఈవి కార్లలో ఈ తప్పులు చేయకండి
Image Credit : carnewschina.com

ఈవి కార్లలో ఈ తప్పులు చేయకండి

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఏసీని నిరంతరం ఉపయోగించడం, కొండ ప్రాంతాల్లో ప్రయాణించడం, ప్రయాణికుల బరువు, అధిక వేగంతో నడపడం వంటి అంశాలు బ్యాటరీ ఛార్జ్ ను వేగంగా తగ్గించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో స్థిరమైన వేగంతో నడపడం, రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను సరిగ్గా ఉపయోగించడం వల్ల రేంజ్‌ను పెంచుకోవచ్చు.

ఈవీ కార్ల బ్యాటరీ కాలం గడిచేకొద్దీ సామర్థ్యాన్ని కోల్పోతుంది. అందుకే కారు కొనేముందు బ్యాటరీ వారంటీ, కిలోమీటర్ల పరిమితి, వారంటీ నిబంధనలు తప్పకుండా చూడాలి. చాలా ఈవీ కార్లకు 5 నుంచి 8 ఏళ్ల వరకు బ్యాటరీ వారంటీ లభిస్తుంది.

55
పెట్రోల్ కారు vs ఈవి కారు
Image Credit : magnific

పెట్రోల్ కారు vs ఈవి కారు

ఈవీ కార్లను స్లో/మోడరేట్ ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. ఫాస్ట్ ఛార్జర్ వాడితే సమయం తగ్గుతుంది. కానీ ఎంత వేగంగా ఛార్జ్ అవుతుందనేది కారు బ్యాటరీ, ఛార్జర్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.

భారత్‌లో ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేగంగా విస్తరిస్తోంది. 2026 ఆగస్టు నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 67,657 ఈవీ ఛార్జర్లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

క్లుప్తంగా చెప్పాలంటే..

పెట్రోల్ కారు = ఎక్కువ ఇంధనం + ఎక్కువ రొటీన్ మెయింటెనెన్స్

ఈవీ కారు = తక్కువ ఛార్జింగ్ ఖర్చు + తక్కువ రొటీన్ మెయింటెనెన్స్

మీ రోజువారీ ప్రయాణ దూరం, ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం, సుదూర ప్రయాణ అవసరాలు, బ్యాటరీ వారంటీ, మొత్తం ఖర్చు వంటివి లెక్కించుకుని కారు కొనడం ఉత్తమ నిర్ణయం అవుతుంది. వీటి ఆధారంగా పెట్రోల్ కారు బెటరా లేక ఈవి బెటరా మీరే నిర్ణయించుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Yamaha R2 : R15 కి బాప్ లాంటి బైక్ వచ్చేసింది.. KTM కి గట్టి కాంపిటీషన్.. యామహా R2 గ్రాండ్ ఎంట్రీ !
Recommended image2
EV Car: 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌.. ఏకంగా 1100కిలో మీట‌ర్ల మైలేజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ కారు
Recommended image3
TVS: 145 కిలోమీట‌ర్ల మైలేజ్‌, టైప్‌సీ ఛార్జ‌ర్‌.. టీవీఎస్ నుంచి అదిరిపోయే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్
Related Stories
Recommended image1
EV Car: 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌.. ఏకంగా 1100కిలో మీట‌ర్ల మైలేజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ కారు
Recommended image2
Tata EV Discounts: టాటా ఈవీ కార్లపై రూ.3.35 లక్షల వరకు తగ్గింపు ఆఫర్లు.. డోంట్ మిస్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved